ఎంసెట్ ఫలితాల విడుదల.. అక్టోబరు 9 నుంచి కౌన్సెలింగ్

తెలంగాణలో నిర్వహించిన ఎంసెట్-2020 ఫలితాలు  విడుదలయ్యాయి. హైదరాబాద్, కూకట్‌పల్లిలోని జేఎన్‌టీయూ క్యాంపస్‌లో 3.30 గంటలకు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి, ఎంసెట్‌ కన్వీనర్‌ గోవర్ధన్‌ రెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. ఎంసెట్‌ పరీక్ష రాసిన వారిలో 89,734 మంది(75%) ఉత్తీర్ణత సాధించారు. eamcet.tsche.ac.in లో అభ్యర్థులు తమ ఫలితాలు చూసుకోవచ్చు.

తెలంగాణ ఎంసెట్ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు అక్టోబరు 9 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. అక్టోబరు 9 నుంచి 17 వరకు ఇంజనీరింగ్ సీట్ల కోసం ఆన్‌లైన్‌లో స్లాట్స్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన అక్టోబరు 12 నుంచి 18 వరకు జరగనుంది. అభ్యర్థులు అక్టోబరు 12 నుంచి 20 వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ఈ నెల 22న ఇంజినీరింగ్ మొదటి విడత సీట్లు కేటాయిస్తామని ప్రవేశాల కమిటీ కన్వీనర్, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ తెలిపారు. 22 నుంచి 27 వరకు ఆన్‌లైన్‌లో బోధన రుసుము చెల్లించి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని సూచించారు.

ఆలాగే ఇంజినీరింగ్ పరీక్షలు రాసిన విద్యార్థులు… ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. అధికారిక సమాచారం ప్రకారం… తెలంగాణ ఎంసెట్ ఫలితాలు… మనబడి వెబ్‌సైట్‌లో విడుదలయ్యాయి.

ఫలితాల కోసం:

Step 1: విద్యార్థులు మధ్యాహ్నం 3.30 తర్వాత… అధికారిక వెబ్‌సైట్ eamcet.tsche.ac.in లోకి వెళ్లాలి.

Step 2: హోం పేజీలో టీఎస్ ఎంసెట్ రిజల్ట్ 2020 లింక్ క్లిక్ చెయ్యాలి

Step 3: టీఎస్ ఎంసెట్ రిజల్ట్ 2020 పేజీ తెరచుకుంటుంది.

Step 4: లాగిన్ వివరాలు ఎంటర్ చెయ్యాలి.

Step 5: ఫలితాలు కనిపిస్తాయి. వాటిని డౌన్‌లోడ్ చేసుకోండి. భవిష్యత్ అవసరాల కోసం ఓ హార్డ్ కాపీని మీ దగ్గర ఉంచుకోండి.