జాతి రత్నాలు నుండి స్పెషల్ సాంగ్ విడుదల

చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన చిత్రం జాతి రత్నాలు. అనుదీప్‌ కేవీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ కీలక పాత్రలు పోషించారు. ఫరీదా కథానాయికగా నటించింది. శివరాత్రి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రతి ఒక్కరిని అలరించింది. ముఖ్యంగా ఈ మూవీలోని కామెడీ సరికొత్త వినోదాన్ని పంచింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ‘అర్రెరె జాతిరత్నాలు’ అంటూ సాగిన ప్రత్యేక పాటను వైజయంతి నెట్‌వర్క్ సంస్థ తన యూట్యూబ్‌లో షేర్‌ చేసింది. రామ్‌ మిర్యాల పాడిన పాటకి సంబంధించిన వీడియోలో ప్రచారం కార్యక్రమాల విజువల్స్ పంచుకున్నారు. రథన్‌ సంగీతం సమకూర్చిన ఈ చిత్రంలో బ్రహ్మానందం, మురళీ శర్మ, వెన్నెల కిశోర్‌, బ్రహ్మజీ, తనికెళ్ల భరణి తదితరులు నటించారు.