శ్రీ నృసింహ గోవింద నామావలి విడుదల

కదిరి, శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీ ప్రహ్లాద లక్ష్మీ నరసింహ స్వామి వైభవాన్ని భక్తులకు మరింత చేరువ చెయ్యాలని, శ్రీ వారికి ప్రతి ఏటా జరిగే ఉత్సవాలను, బ్రహ్మోత్సవాల ప్రాముఖ్యతను తెలిసేలాగ నృసింహ జయంతి పర్వదినం సందర్భంగా ఖాద్రీ లక్ష్మి నృసింహ గోవింద నామావలిని రూపొందించి గురువారం ప్రసిద్ధ పుణ్య క్షేత్రం శ్రీ మధ్ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి పట్టెం గురు ప్రసాద్, ఆలయ చైర్మన్ జెరిపిటి గోపాల కృష్ణ, ఆలయ ప్రధాన అర్చకులు వసంతాచార్యులు, ఆలయ పాలక మండలి సభ్యులు శివకుమార్, అశ్వర్థ నారాయణ శ్రీ నృసింహ గోవింద నామావలిని విడుదల చేశారు. రచయిత చిన్నారావు మాట్లాడుతూ ప్రతి పుణ్య క్షేత్రానికి వెళ్ళిన గోవింద నామాలు, లలిత సహస్ర నామాలు ఇలా విరివిగా లభిస్తూ ఉంటాయి ఆ క్రమంలోనే మన ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి నామావలిని రూపొందించాలి అని అనుకున్న వెంటనే ఆ నరసింహ స్వామి వారి ఆశీస్సులతో అర్చకులు కుమార స్వామి సహకారంతో ఈ నామావళి రూపొందించడం అందుకు అందరూ సహకరించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఈ గోవింద నామావలిని రచించిన లిటిల్ స్కాలర్స్ స్కూల్ అధినేత చిన్నరావు, సంగీతాన్ని అందించి గానం చేసిన హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ పూర్ణ చంద్ర మరియు వారి బృందం యామిని, గాయత్రి, వీడియో ఎడిటింగ్ చేసిన కార్తికేయ డిజిటల్ టీమ్ కార్తిక్, చక్రిలకు అభినందనలు తెలియజేశారు. కార్యక్రమం అనంతరం చిన్నారావు, బత్తల ప్రసాద్, వెంకటాచలం, శేషు, జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు లక్ష్మణ కుటాల, చక్రి, కార్తిక్, రంగనాథ్, సోము, నందిశెట్టి బాబు, యుగంధర్, తదితరులు చలపతి నాయిని సత్రాన్ని ( అమృత వల్లి సదన్ ) ఆధునీకరించి శ్రీ వారి దర్శనం కోసం వచ్చే భక్తులకు అందుబాటులోకి తీసుకొని వచ్చినందుకు ఆలయ చైర్మన్ జెరిపిటి గోపాల కృష్ణ,ఆలయ కార్య నిర్వాహణా అధికారి పట్టెం గురుప్రసాద్ లను సభ్యుల సమక్షంలో సన్మానించారు.