*ధార్మిక సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు ధారాధత్తం చేస్తున్న ఎండోమెంట్ అధికారులు కొమ్ముకాస్తున్న ప్రజాప్రతినిధులు
*ఆశ్రమం స్థలం లీజుపై విచారణ చేపట్టవలసిందిగా పోరాడుతున్న స్థానికులు
*పదిమంది విరాళాల ద్వారా జరుగుతున్న దైవ కార్యక్రమాలను అడ్డుకోవడం తప్పు
నెల్లూరు నగరంలోని ఐదో డివిజన్ సత్యనారాయణపురంలో ఉన్న శ్రీ భరద్వాజ ఆశ్రమ పరిధిలోని కృష్ణ మందిరం మరియు ఉమామహేశ్వర ఆలయానికి సంబంధించిన హాలు, మూడు గదులు అనేక సంవత్సరాలుగా భక్తులు పూజలు, హోమాలు, ధార్మిక కార్యక్రమాల కోసం ఉపయోగించుకుంటున్నారు. అయితే, ఎండోమెంట్ అధికారుల సహకారంతో ఈ భక్తి క్షేత్రాన్ని తక్కువ ధరకు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యానికి లీజుకు ఇచ్చినట్లు వార్తలు బయటకు రావడంతో భక్తులు తీవ్రంగా స్పందించారు. ఇది భక్తులకు తెలియకుండా చేయడం, వారి అనుమతి లేకుండా ఆలయ కార్యకలాపాలను ప్రైవేటుకు అప్పగించడం మానవీయంగా, ధార్మికంగా సరికాదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఆశ్రమానికి సంబంధించిన వస్తువులను ఒక గదిలో వేసి తాళం వేసి భక్తుల అనుసంధానాన్ని పూర్తిగా తొలగించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ విషయమై భక్తులు మున్సిపల్ శాఖా మాత్యులు, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే నారాయణ గారికి అర్జీ ఇచ్చారు. జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు సిటీ పర్యవేక్షకులు గునుకుల కిషోర్ స్థలాన్ని పరిశీలించి భక్తుల ఆవేదనను స్వయంగా తెలుసుకున్నారు. అలాగే, ఈ విషయాన్ని జనసేన జిల్లా పర్యవేక్షకులు వేములపాటి అజయ్ గారికి తెలియజేసి, పూజా స్థలాలను ప్రైవేట్ పరంగా మారకుండా కాపాడేందుకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పదిమంది భక్తుల విరాళాల మీద నడుస్తున్న దైవ కార్యక్రమాలకు తగిన గౌరవం కలిగించాల్సిన సమయంలో, ఇలాంటి చర్యలు ప్రజల్లో అసంతృప్తిని కలిగిస్తున్నాయని, మూడు సంవత్సరాల తరువాత స్థలాన్ని తిరిగి పొందగలమన్న నమ్మకం భక్తులలో లేదని వారు తెలిపారు. ధార్మిక స్థలాలపై స్థానికులు, విశ్వాసుల భావజాలాన్ని గౌరవించి, విచారణ చేపట్టి న్యాయం జరగాలని జనసేన నేతలు డిమాండ్ చేశారు.
Share this content:
Post Comment