అంగన్వాడీల తొలగింపు అన్యాయం

  • జనసేన నేత గురాన అయ్యలు

విజయనగరం: వైకాపా ప్రభుత్వం అంగన్వాడీలను విధుల నుండి తొలగింపు ప్రక్రియకు శ్రీకారం చుట్టడం అన్యాయమని జనసేన నేత గురాన అయ్యలు మండిపడ్డారు. సోమవారం విజయనగరంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ.. అంగన్వాడీల తొలగింపు ఉత్తర్వులను ఖండించారు. అంగన్వాడీలను ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం.. సీఎం జగన్ నియంతృత్వ పోకడలకు అద్దంపడుతోందని విమర్శించారు. అంగన్వాడీలను ఉద్యోగాల నుంచి తొలగించే అధికారం జగన్ కు ఎవరిచ్చారని నిలదీశారు. 42 రోజుల నుంచి సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ల పట్ల ప్రభుత్వ వైఖరి అప్రజాస్వామికంగా ఉందని ఆయన మండిపడ్డారు. జనసేన పార్టీ తరుపున అంగన్‌వాడీలకు అండగా ఉంటామన్నారు. అంగన్వాడీల కన్నీటిలో వైసీపీ ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయమని అన్నారు.