పాడైన ఐరన్ పోల్స్ తొలగించి పునరుద్ధరణ చర్యలు చేపట్టండి

పిఠాపురం: నియోజకవర్గ ప్రజా జీవన శ్రేయస్సుకై పట్టణ జనసేన పార్టీ జనసైనికుల నేతృత్వంలో టౌన్ నాయకులు చెల్లుబోయిన సతీష్ నాయకత్వంలో జనసేన అధికార ప్రతినిధి తోలేటి శిరీష, నియోజకవర్గ నాయకులు వెన్నా జగదీష్ ఆధ్వర్యంలో ఏ.పి.ఈ.పి.డి.సి.ఎల్ పిఠాపురం విభాగపు గౌరవ ఏఈ కి, పిఠాపురం పట్టణం నందు విద్యుత్ సరఫరా గాను ఏర్పరిచిన అనేక ఐరన్ పోల్స్ దశాబ్దాల క్రితం కాలం నాటివి కావడం వలన అవి అంత్యదశకు చేరుకుని, అత్యంత ప్రమాదకర స్థితి నందు నిర్వీర్యం అయిపోతున్న స్థితిని ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా పిఠాపురం మెయిన్ రోడ్ లో పప్పుల వారి రాంకోలు సెంటర్ 12వ వార్డు పరిధిలో వైర్ల ఆధారితంగా మాత్రమే నిలబడి ఏమాత్రం గాలి ఉధృతమైన పడిపోయేలా ఉన్న ఐరన్ పోల్ ని చూపి ఇలా శిథిలావస్థకు చేరిన ఇనుప స్తంభాలు జనావాసాల మధ్యలో నిత్యం రాకపోకలు సాగించే మెయిన్ రోడ్డుకు ఆనుకుని ఉండడం వంటి కారణాల చేత విపరీతమైన గాలులు వీచే తుఫానుల సమయమైన ఈ వాన కాలంలో సదరు శిధిలా వ్యవస్థ ఐరన్ పోల్స్ వలన అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల మాటున ప్రజాజీవనం కొనసాగించవలసిన భయంకరమైన పరిస్థితులు నేడు నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్థితి వివరించి జరగబోయే ప్రమాదాలు నివారించేందుకు తగు మరమత్తులను వారిని ముందుగానే చేపట్టి పూర్తిగా నిర్వీణ స్థితికి చేరుకున్న స్తంభాలను తొలగించి పునరుద్ధరణ చర్యలు చేపట్టవలసిందిగా కోరి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మాగాపు సతీష్, చెల్లుబోయిన విజయ్ కుమార్, పల్నాటి మధు, వేల్పుల చక్రధర్, బుర్ర సూర్య ప్రకాష్, విరవాడ ఎంపీటీసీ అభ్యర్థి రామిశెట్టి సూరిబాబు, బావిశెట్టి రామకృష్ణ, పేర్నీడి చక్ర నారాయణ, కొండపల్లి శివయ్య, తిరంశెట్టి ఇస్సాక్, ముమ్మిడి రామం, పెనుబోతుల చక్రి, జల్లూరు జనసేన ప్రెసిడెంట్ బత్తిన దొరబాబు, పిల్లి అన్నవరం మరియు గంజి గోవింద రాజు మొదలైన వారు పాల్గొన్నారు.