కుంటిమద్ది ఆధ్వర్యంలో శిధిలమైన గుంతల రహదారికి మరమ్మత్తు
- క్లాక్ టవర్ బ్రిడ్జి ప్రక్కన కోర్టు రోడ్డుకు వైపు వెళ్లే సర్వీస్ రోడ్డు.. శిధిలమైన గుంతల రహదారికి మరమ్మత్తు
- రోడ్డు మరమ్మత్తు చేసినందుకు అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డికి “అభినందనలు” తెలిపిన స్థానిక నగర ప్రజలు, వాహనదారులు, దుకానుదారులు
- జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన శ్రమదానం కార్యక్రమం ద్వారా గుంతలు పడ్డ రహదారి మరమ్మత్తు చేసినందుకు స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన
అనంతపురం: జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 సోమవారము అనంతపురం అర్బన్ నియోజకవర్గం పరిధిలోని టవర్ క్లాక్ బ్రిడ్జ్ పక్కన కోర్ట్ రోడ్డుకు పోవు సర్వీస్ రోడ్డు… శిధిలమైపోయిన రహదారికి జనసేన నాయకులు తెల్ల గరుసు వేసి గోతులను పూడ్చి చదును చేశారు. సంవత్సరాల తరబడి గుంతలు పడ్డ రోడ్లపై ప్రయాణం చేయలేక ఇబ్బంది పడుతున్నామని వాహనదారులు తెలియజేశారు. అనంతరం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరామిరెడ్డి స్పందించి రహదారిని తన సొంత నిధులతో బాగు చేయడం పట్ల స్థానికులు, వాహనదారులు, వ్యాపారస్తులు… జనసేన పార్టీకి, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మరియు శ్రమదాన కార్యక్రమం చేసి రోడ్డు మరమ్మత్తు చేసిన జనసేన జిల్లా ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరామిరెడ్డి గారికి అభినందనలు తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-03-at-5.38.53-PM-1024x466.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-03-at-5.38.53-PM-1-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-03-at-5.38.54-PM-1024x576.jpeg)