కరోనా సేవలకు మరో 30,887 మెడికల్‌ పోస్టుల భర్తీ… ఏపీ సర్కార్

ఏపీలో గత వారం రోజులుగా కరోనా ఉదృతి పెరిగిన నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా ఆసుపత్రుల్లో వైద్యం, సంబంధిత సేవల కోసం వైద్య సిబ్బందిని త్వరితగతిన నియమించి కోవిడ్19 మహమ్మారిని అరికట్టాలని భావిస్తోంది. ఈ మేరకు  మొత్తం 30,887 పోస్టుల భర్తీ చేపట్టేందుకు అధికారులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఇదివరకే 8,439 మంది డాక్టర్లు, నర్సులను నియమించగా, మిగిలిన పోస్టుల  కోసం తాజాగా నిర్ణయం తీసుకున్నారు. కరోనా మహమ్మారితో పాటు ఏదైనా ఆరోగ్య విపత్కర పరిస్థితులు ఎదుర్కోవడంలో భాగంగా స్పెషలిస్ట్‌ డాక్టర్లు, జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్లు (జీడీఎంవో), స్టాఫ్‌ నర్సులు, ట్రైనీ నర్సులు, పారిశుధ్య సిబ్బందిని నియమించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచిస్తునే కోవిడ్19 ఆస్పత్రులలో అధిక మొత్తంలో బెడ్స్‌ను కూడా ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.