జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు…

72వ గణతంత్ర దినోత్సవ వేడుకలను జనసేన పార్టీ హైదరాబాద్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మంగళవారం ఉదయం నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు భరతమాత, జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాల వేసి  నివాళులర్పించారు. జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ అర్హంఖాన్, అధ్యక్షుల వారి రాజకీయ కార్యదర్శి శ్రీ పి.హరిప్రసాద్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు శ్రీ రాధారం రాజలింగం, పార్టీ ముఖ్య నాయకులు శ్రీ ఎ.వి.రత్నం, శ్రీ షేక్ రియాజ్, శ్రీ వై.నగేష్ తోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.