మైలవరం జనసేన కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

మైలవరం నియోజకవర్గం: మైలవరం జనసేన పార్టీ కార్యాలయం, మైలవరం నందు 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మండల అధ్యక్షులు శీలం బ్రహ్మయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేనపార్టీ రాష్ట్రఅధికార ప్రతినిధి మరియు మైలవరం నియోజకవర్గ ఇన్చార్జి అక్కల రామ్మోహన్రావు(గాంధీ)పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మైలవరం మండల అధ్యక్షులు శీలం బ్రహ్మయ్య, రెడ్డిగూడెం మండల అధ్యక్షులు చాపలమడుగు కాంతారావు, మైలవరం మండల ఉపాధ్యక్షులు పడిగల ఉదయ్, గుమ్మడి శ్రీనివాసరావు, రెడ్డిగూడెం మండల ఉపాధ్యక్షులు సుందర్ రామిరెడ్డి, జనసేన వీర మహిళలు గజరావు పద్మావతి, దద్దనాల చంద్రకళ,మండల నాయకులు కూసుమంచి కిరణ్ కుమార్, మల్లారపు దుర్గాప్రసాద్, సిరియాల వర్మ, ఆనం విజయ్ కుమార్, మాదాసు సుబ్బారావు, ఉయ్యూరు నాగరాజు, మైలవరం టౌన్ ఉపాధ్యక్షులు గొట్టపు రవితేజ, ప్రధానకార్యదర్శి కరెడ్ల మధుబాబు, సంయుక్త కార్యదర్శులు నీలి రాంబాబు, బాలబోలు వెంకయ్య, గ్రామ అధ్యక్షులు తోట మాధవరావు, వీర్ల పౌల్ రాజ్, పసుపులేటి నాగరాజు, ఎడ్ల మధుబాబు, తోట క్రాంతిబాబు, గ్రామ కమిటీ సభ్యులు, జనసైనికులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.