జనసేన ఆధ్వర్యంలో పలుచోట్ల గణతంత్ర దినోత్సవ వేడుకలు

పాలకొండ నియోజకవర్గం: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో.. జనసైనికుల నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలుకు మరియు టెక్కలి నియోజకవర్గంలో కణితి కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ చేతుల మీదగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ వేడుకల్లో ఉత్తరాంధ్ర కో కన్వీనర్ గర్భాన సత్తిబాబు, మాజీ ఉపాధ్యాయులు పొగిరి సురేష్ బాబు, ఆమదాలవలస ఇంచార్జ్ పెడాడ రామ్మోహన్, ఎచ్చెర్ల నియోజకవర్గ నాయకులు అర్జున్ కుమార్, భూపతి, యువ నాయకులు తలాబత్తుల పైడి రాజు తదితరులు పాల్గొన్నారు.