రాజానగరం నియోజకవర్గంలో అత్యంత వైభవంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు..

  • కోరుకొండ మండల జనసేన పార్టీ కార్యాలయ ఆవరణలో భారత దేశ త్రివర్ణ పతాకాన్ని ఎగరేవేసి వందనాలు సమర్పించిన వీరమహిళలు..
  • జనసేన పార్టీ పక్షాన అంబరాన్నంటిన సంబరాలు..
  • కోరుకొండ వీధుల వెంబడి భారీ జాతీయ జెండాను ప్రదర్శన.. లక్ష్మీ నరసింహస్వామి గుడి వరకూ సాగిన ర్యాలీ(యాత్ర)..
  • “వందేమాతరం” “భారత్ మాతాకీ జై” “జై భారత్” “జై జవాన్” “జై కిసాన్” లాంటి నినాదాలతో మార్మోగిన కార్యక్రమం..
  • మహనీయులని, వారు దేశానికి చేసిన సేవలను స్మరించుకుంటూ వారికి జేజేలు జోహార్లు పలికిన జనశ్రేణులు..

రాజానగరం నియోజకవర్గంలో అత్యంత వైభవంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. కార్యక్రమంలో భాగంగా జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి వెంకటలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన ఈ రోజు ఎంతో పవిత్రమైన రోజు.. కులాలు వేరైనా, మతాలు వేరైనా మనమంతా భారతీయులం, మనకు స్వేచ్ఛ వాయువుల్ని ప్రసాదించిన మహనీయులు స్వాతంత్ర్యం కోసం ధన, మాన, ప్రాణ లను సైతం కోల్పోయి మనకు ఈ స్వేచ్చా వాయువుల్ని ప్రసాదించారు, రాజ్యాంగం మనకు అందించిన ప్రపంచ మేధావి, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు దేశం కోసం చేసిన సేవలను ఈ సందర్భంగా కొనియాడుతూ, వీళ్ళ మార్గంలో జనసేన పార్టీ నడుస్తుందని.. అంబేద్కర్ గారి ఆశయ సారథి పవన్ కళ్యాణ్ గారే భారతదేశ చరిత్రలో జనవరి 26, 1950వ సంవత్సరం భారతీయులందరం గుర్తు పెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన రోజు. 200 సంవత్సరాలపాటు బ్రిటీష్‌వారి పరిపాలనలో మగ్గిన మన దేశానికి, ఆగస్టు 15, 1947న స్వాతంత్ర్యం వచ్చింది. అప్పటివరకూ మనదేశ పరిపాలనా విధానం పూర్తిగా బ్రిటీష్ రాజ్యాంగం ప్రకారం అమలు జరిగేది. వారిని మనదేశం నుంచి వెళ్లగొట్టిన తరువాత మన దేశాన్ని మనమే పరిపాలించుకునేందుకు ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకోవాల్సి వచ్చింది. అలా.. 1950, జనవరి 26న రాజ్యాంగం నిర్మించబడి, భారతదేశం పూర్తి గణతంత్ర దేశం అయ్యింది. ఆ రోజు నుంచి భారతదేశం పూర్తిగా ప్రజా ప్రభుత్వంగా రూపుదిద్దుకుంది. గణతంత్ర రాజ్యం అంటే.. ప్రజలే -ప్రభుత్వము, ప్రభుత్వమే-ప్రజలు అని అర్థం. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భారత రాజ్యాంగాన్ని తయారు చేసేందుకు ఎంతోమంది మేధావులు, ఎన్నో దేశాల రాజ్యాంగాలను పరిశీలించారు. ఎన్నో రకాల అంశాలతో చాలాకాలంపాటు రాజ్యాంగ ఏర్పాటుకు కృషిచేసి రూపొందించారు రాజ్యాంగాన్ని 1950 జనవరి 26వ తేదీ నుంచిఅమలుజరిపారు. ఆనాటి నుంచి భారతదేశము “సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర” రాజ్యంగా అవతరించబడింది. అప్పటినుంచి ఈరోజును గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ముఖ్యంగా మనదేశ రాజధాని ఢిల్లీ నగరంలో భారత రాష్ట్రపతి ఆధ్వర్యంలో ఈ గణతంత్ర వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పెద్దలు, నేతలు, జనసైనికులు, వీరమహిళలు, స్థానికప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.