రేగులపాడులో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు

పాలకొండ నియోజకవర్గం: వీరఘట్టం మండలం, రేగులపాడు పాఠశాలలో 75వ గణతంత్ర దిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రేగులపాడు గ్రామ సర్పంచ్ మెరుగుల భవాని చంద్రమౌళీశ్వరరావు ప్రధాన ఉపాధ్యాయులు డి. కృష్ణవేణి టి. సరోజిని, ఏ. ప్రసాద్ రావు, రేగులపాడు జనసేన ఎంపీటీసీ అభ్యర్థి జనసేన జానీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా విద్యార్థులను ఉద్దేశిస్తూ వారు మాట్లాడుతూ.. స్వాతంత్రం వచ్చిన తరువాత దేశానికి రాజ్యాంగం ఉండాలని భావించిన నాటి దార్శనికులు మేధావులు, రాజ్యాంగ పరిషత్ ను ఏర్పాటు చేసి బ్రిటిష్ కాలం నాటి భారత ప్రభుత్వ చట్టం భారతదేశం సర్వసత్తాక ప్రజాస్వామ్య లౌకిక సామ్యవాద గణతంత్ర రాజ్యంగా అవతరించడానికి కృషి చేశారని, ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం గల దేశంగా భారతదేశం ఖ్యాతి గాంచిందని దీని రచనకు రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజులు అంబేద్కర్ గారికి పట్టిందని కుల మతం లింగ వర్ణ వివక్ష లేకుండా ప్రజలందరికీ హక్కులను కల్పించాలని అలాగే ప్రతి పౌరుడు దేశ సేవకు, దేశాభివృద్ధికి పాటుపడేలా బాధ్యతలు కలిగి ఉండాలని, నేటి బాలలే రేపటి పౌరులని విద్యార్థులు అందరినీ ఉద్దేశించి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియచెయ్యడం జరిగింది. భారతదేశానికి స్వాతంత్రం పొందడంలో భారత రాజ్యాంగాన్ని అమలు చేయడంలో ముఖ్య పాత్ర పోషించిన గొప్ప వ్యక్తులను మనం ఈరోజు ఎందుకు స్మరించుకుంటున్నామంటే వారి కారణంగానే భారతదేశం నేడు గణతంత్ర రాజ్యంగా పిలవబడుతుందని మన గొప్ప భారతీయ నాయకులు స్వాతంత్ర సమరయోధులు ఎందరో మహావీరులు స్వాతంత్రం కోసం తమ ప్రాణాలను త్యాగం చేశారని, ఎందుకంటే భవిష్యత్ తరాలు ఎవరికీ బానిసలుగా ఉండకూడదని, తమ హక్కులను స్వేచ్ఛగా వినియోగించుకోవాలి అని వారి ఆకాంక్ష అని ఈ సందర్బంగా తెలియజెయ్యడం జరిగింది.