డుంబ్రిగూడ మండలం, పెదపాడు గ్రామంలో సోమవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సి.సి. రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం డుంబ్రిగూడ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ సమీపంలోని హైస్కూల్ గ్రౌండ్‌లో బహిరంగ సభ జరిగింది. సభ ప్రాంగణంలో పవన్ ప్రజల సమస్యల స్వీకరణకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రేగపుణ్యగిరి ప్రజలు, జనసేన ఎస్.కోట సీనియర్ నాయకులు వబ్బిన సన్యాసి నాయుడు నేతృత్వంలో, తమ గ్రామానికి కూటమి ప్రభుత్వం ₹4 కోట్లు మంజూరు చేసినప్పటికీ, బిటి రోడ్ పనులు అర్థాంతరంగా నిలిచిపోయిన విషయాన్ని వెల్లడించారు. ఇది 2 ఎకరాల అటవీ భూమి గుండా వెళ్లాల్సి ఉండటంతో, విజయనగరం జిల్లా కలెక్టర్ పాడేరు జిల్లా కలెక్టర్‌కు అనుమతి ప్రతిపాదనలు పంపినప్పటికీ, ఇప్పటివరకు అటవీ అనుమతులు మంజూరు కాలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ని ఫారెస్ట్ మంత్రి హోదాలో వెంటనే కలెక్టర్‌ను ఆదేశించి అటవీ అనుమతులు ఇప్పించి రోడ్ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేసినట్లు వబ్బిన సన్యాసి నాయుడు మీడియాకు వెల్లడించారు.
Share this content:
Post Comment