ఎస్.కోట, రేగపుణ్యగిరి గ్రామసభలో కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలు అమలు చేయాలని కోరుతూ జనసేన పార్టీ ఎస్.కోట నియోజకవర్గ నాయకులు వబ్బిన సన్యాసి నాయుడు ఆధ్వర్యములో ఎస్.కోట పంచాయతీ రేగపుణ్యగిరి గిరిజనులు బుధవారం జిల్లా కలెక్టర్ అంబేద్కర్ ని తన ఛాంబర్లో కలిసి వారి సమస్యలు వివరించారు. తేదీ 17 జనవరి 2025లో పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నిర్వహించిన గ్రామసభలో కలెక్టర్ సమస్యల పరిష్కారముపై ఇచ్చిన ఆదేశాలు అమలు కాలేదని వెంటనే అమలు చేసి డోలీ మొతల బారినుండి తమను కాపాడాలని వారు విజ్ఞప్తి చేశారు. పుణ్యగిరి శివాలయం నుండి ఉపాధిహామీ నిధులతో 4కోట్లతో 3.5 కిలోమీటర్లు రోడ్డు కలెక్టర్ మంజూరు చేసినప్పటికీ కాంట్రాక్టరు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్షం వల్ల పనులు ఆగిపోయాయని, డ్రైనేజీ, రోడ్ మెటీరియల్ పనులు మొదలు కాలేదని, మార్చి25 నాటికి పూర్తి చేస్తామని ఇచ్చిన హామీ అమలు కాలేదన్నారు. ఈ వేసవిలో పనులు వేగవంతం చేసేలా ఇంజనీరింగ్ అధికారులకు కాంట్రాక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని కలెక్టర్ ను వారు కోరారు. 1.8కిలోమీటర్లు రోడ్డుకి 2 ఎకరాలు ఫారెస్ట్ అనుమతులు ఇవ్వమని పాడేరు జిల్లా కలెక్టర్ తో విజయనగరం జిల్లా కలెక్టర్ సంప్రదించి ఫారెస్ట్ అనుమతులు త్వరగా వచ్చేలా చూడాలని సన్యాసి నాయుడు కలెక్టర్ కి విజ్ఞప్తి చేశారు. అలాగే రెవెన్యూ సర్వే త్వరగా చేపట్టి గిరిజనులు సాగు చేసిన భూములకు పోడు పట్టాలు,హౌసింగ్ స్కీముల ఇళ్ల నిర్మాణానికి పోసిషన్ పట్టాలు, ఇవ్వాలని కోరారు.మినీ అంగన్వాడీ సెంటర్,ప్రభుత్వ హౌసింగ్ స్కీములు మంజూరు చేసి, కొందులను – ఎస్.టీ (పీవీ టీజీ)లు గుర్తించాలని తద్వారా కేంద్ర ప్రభుత్వ జన్ మన్ పథకాలను తమకు అమలు చేయాలన్నారు. వారం రోజుల్లో అధికారులు స్పందించని పక్షములో జనసేన పార్టీ అద్యక్షులు, ఉపముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ ని అమరావతిలో నేరుగా తామంతా కలిసి తమ సమస్యలను పరిష్కరించాలని కోరతామని జనసేన నేత సన్యాసి నాయుడు మీడియాకు తెలిపారు.
Share this content:
Post Comment