తూర్పుకాపు కులాన్ని ఓబిసి జాబితాలో చేర్చాలని వినతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర మినహా మిగిలిన 20 జిల్లాల్లో నివసిస్తున్న తూర్పుకాపు కులాన్ని ఓబిసి జాబితాలో చేర్చాలనే డిమాండ్ పై, గురువారం న్యూఢిల్లీ పార్లమెంట్ భవన్లో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు నేతృత్వంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధులుగా హాజరైన కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి వీరేంద్ర కుమార్, జాతీయ ఎన్.సి.బి.సి ఛైర్మన్ హన్సరాజ్ గంగారాం, బిజేపి జాతీయ ఓబిసి చైర్మన్ లక్ష్మణ్, మాజీ ఎంపి గివి నరసింహులు, ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఐదు కులాకు ఓబిసి రిజర్వేషన్ కల్పించే బాధ్యత తీసుకుంటామని అన్నారు. తూర్పుకాపు, కళింగ కోమటి, ఆరవల, శిష్టకరణ, సొండి సామాజిక వర్గాలను ఓబిసి జాబితాలో చేర్చాలనే అంశాన్ని పార్లమెంట్ ఆమోదం తెలపాలని కోరినట్లు జాతీయ ఎన్.సి.బి.సి కమిషన్ చైర్మన్ అన్నారు, అనంతరం తూర్పుకాపు సామాజికవర్గానికి ఓబిసి రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ కు విజ్ఞాపన పత్రాన్ని అందజేస్తున్న రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, విజయనగరం ఎంపి కలిశెట్టి అప్పలనాయుడు, ఆలిండియా తూర్పుకాపు సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, జనసేన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్, రాష్ట్ర తూర్పుకాపు సంఘం ఓబిసి చైర్మన్ సరిపిడకల రామారావు, తూర్పుకాపు సంక్షేమ సంఘం రాష్ట్ర నేత, టి.డి.పి శ్రీకాకుళం జిల్లా ప్రధానకార్యదర్శి పిరుకట్ల విఠల్, ఏ.పి.టి.కె.ఎస్.ఎస్ ఓబిసి సాధన కమిటీ చైర్మన్ పల్లా వెంకటరావు, ఐదు సామాజిక వర్గాల సంఘ ప్రతినిధిలున్నారు.

Share this content:

Post Comment