గిరిజన డిక్లరేషన్ జనసేన మేనిఫెస్టోలో చేర్చాలని వినతి

హైదరాబాద్, జనసేన పార్టీ జూబ్లీహిల్స్ కార్యాలయంలో శనివారం సేవాలాల్ సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆంగోతు రాంబాబు నాయక్ తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో గిరిజన డిక్లరేషన్ ను జనసేన పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చి అమలు చేయాలని కోరుతూ జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరు శంకర్ గౌడ్, గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ రాధారం రాజలింగం మరియు గ్రేటర్ హైదరాబాద్ జనరల్ సెక్రెటరీ దామోదర్ రెడ్డి లకు వినతిపత్రం ఇవ్వడం జరిగినది.