సర్వేపల్లి, మనుబోలు మండలంలో కుడితిపల్లి బండేపల్లి మడమనూరుతో పాటు పలు చెరువులు ఆక్రమణకు గురై చెరువులు కనుమరుగైపోతున్నాయి. ఇలా చెరువుల ఆక్రమణకు గురయితే రాబోయే రోజుల్లో తాగునీరు సాగునీరుకి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి కాబట్టి మండల రెవెన్యూ అధికారికి కూటమి తరపున గురువారం ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ చెరువులకు కూడా హద్దులు ఉంటాయి. మరి హద్దులు మీరి ఆక్రమిస్తే వారి పైన కూడా చర్యలు తీసుకోవాలి, అలా జరగని పక్షంలో కూటమి తరపున మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి వినతి పత్రాలను కూడా ఇచ్చి రాష్ట్రంలోనే కాదు జిల్లాలో నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ చెరువుల ఆక్రమణకు గురయ్యాయో వాటిని కూడా త్వరితగతిన సర్వే పెట్టించి చెరువులని కాపాడుకునే దిశగా కోటమే ప్రభుత్వం పని చేస్తుందని చెప్పి మనస్పూర్తిగా కోరుకుంటూ ఈ మనుబోలు మండలంలో గత ఐదేళ్లలో వైసిపి నాయకులు కోట్ల రూపాయలు విలువ చేసే భూములను ఆక్రమించి చేతులు మార్చుకున్నటువంటి పరిస్థితులు కూడా ఎన్నో ఉన్నాయి. అలా ప్రభుత్వ భూములను మింగేసిన గుంట నక్కల అన్నిటిని కూడా బయటికి తీసి వాళ్లపై చర్యలు తీసుకొని ప్రభుత్వం తమ భూమిని తాము స్వాధీనం చేసుకొని వాటిల్లో బోర్డులను వేసే విధంగా రక్షణ వలయాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టే దానికి కృషి చేయాలని చెప్పి కూటమి తరపున మనస్పూర్తిగా కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు గుమ్మినేని వాణి భవాని నాయుడు మనుబోలు మండల అధ్యక్షుడు పెనుబాక ప్రసాద్ స్థానిక నాయకులు, కంటే సుధాకర్, జాకీర్, మహేష్, సందూరి శ్రీహరి, గాండు ఆనంద్, వెంకయ్య(బీజేపీ), మల్లి, శివ, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment