మైనింగ్ క్వారీలపై చర్యలు తీసుకోవాలని వినతి

చోడవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి పివిఎస్‌ఎన్ రాజు, అనకాపల్లి జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయ్ కృష్ణన్‌ ని కలిసి, చోడవరం నియోజకవర్గంలోని రోలుగుంట మండలంలోని 14 మైనింగ్ క్వారీలను తేదీ 27.03.25 న చేసిన క్షేత్రస్థాయి సందర్శనలో గమనించిన కీలక సమస్యలను ప్రస్తావించారు. వివిధ గ్రామాలలో ఉన్న ఈ క్వారీలు పర్యావరణం, మౌలిక సదుపాయాలు మరియు ప్రజల భద్రతకు సంబంధించిన తీవ్రమైన సమస్యలను కలిగిస్తున్నాయి అని వీటికి తక్షణ విచారణ మరియు చర్య అవసరం అని, సందర్శించిన క్వారీల వివరములను ఆమె దృష్టికి తెచ్చారు. పర్యావరణ పరిరక్షణ మరియు ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాధాన్యతలను పరిగణిస్తూ ఈ సమస్యలను పరిష్కరించడం అత్యవసరమని పివిఎస్‌ఎన్ రాజు పేర్కొన్నారు. ఈ తీవ్ర సమస్యలపై సత్వర చర్యలు కూటమి ప్రభుత్వం యొక్క ప్రతిష్టను నిలబెడుతుంది అని మరియు విస్తృత ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది అని అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ విజయ్ కృష్ణన్ మాట్లాడుతూ ఈ సమస్యపై వెంటనే మైనింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని, అన్ని క్వారీలపై సమగ్ర విచారణ చేపడతామని చేపడతామని ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగాలేని క్వారీలపై కఠిన చర్యలు తీసుకొంటామని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బలిజ మహారాజు, మైచర్ల నాయుడు, గూనూరు మూలు నాయిడు, జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లం రామ అప్పారావు, చోడవరం పట్టాన అధ్యక్షులు కర్రి రమేష్, సీనియర్ నాయకులు చప్పగడ్డ శ్రీను, బోండా మణికంఠ పాల్గొన్నారు.

Share this content:

Post Comment