కౌలు రైతుల కుటుంబాలకు పరిహారం అందని విషయంపై కలెక్టరుకు వినతి

అనంతపురం, ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు రూ.7 లక్షల పరిహారం అందని విషయాన్ని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, అనంతపురం జిల్లా అధ్యక్షుడు టి.సి.వరుణ్, రాష్ట్ర కార్య నిర్వహణ ప్రధాన కార్యదర్శి భవానీ రవికుమార్, రాయలసీమ ప్రాంతీయ మహిళ కమిటీ సభ్యురాలు శ్రీమతి పెండ్యాల శ్రీలత, శ్రీమతి పసుపులేటి పద్మ, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. కౌలు రైతు కుటుంబాలతో కలిసి కలెక్టరేట్ కి వెళ్లి పరిహారం ఇవ్వని విషయాన్ని లిఖితపూర్వకంగా తెలిపారు.

ఈ కార్యక్రమంలో హిందూపురం ఇంఛార్జి ఆకులఉమేష్, రాప్తాడు ఇంఛార్జి సాకే పవన్, నగర అధ్యక్షులు పొదలి బాబురావు, జిల్లా ఉపాధ్యక్షులు జయరాం రెడ్డి, అంకె ఈశ్వరయ్య జిల్లా ప్రధాన కార్యద్శులు కె నాగేంద్ర, పత్తి చంద్రశేఖర్ అలాగే జిల్లా కార్యదర్శిలు, సంయుక్త కార్యదర్శిలు, నగర ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శిలు మరియు కమిటీ సభ్యులు వీరమహిళలు కుమారి రుపా తదితరులు పాల్గొన్నారు.