రోడ్డు అడ్డుకున్నవారిపై చర్యలు తీసుకోవాలని డిప్యూటి తహసిల్దారుకి వినతి

ఎస్.కోట నియోజకవర్గ జనసేన నాయకులు వబ్బిన సన్యాసి నాయుడు ఆధ్వర్యములో రేగపుణ్యగిరి గిరిజనులు తమ రోడ్డు నిర్మాణానికి గల ఆటంకాలు తొలగించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. కూటమి ప్రభుత్వం ఉపాధిహామీ నిధులను 4 కోట్లు కేటాయించి 3.5 కిలోమీటర్లు రోడ్డుకి శంకుస్థాపనలు చేసి పనులు ప్రారంభించినప్పటికి, సోమవారం దిగువ గ్రామములో ఉన్న కొంతమంది వ్యక్తులు దౌర్జన్యంగా పనులు నిలుపుదల చెయించారని, వారితో నయాన, భయాన మాట్లాడి రోడ్డు పనులకు ఆటంకము లేకుండా చేయాలని, రిజర్వ్ ఫారెస్ట్ అనుమతులు కూడా త్వరగా వచ్చేలా చూడాలని తద్వారా మార్చి నెలాఖరుకి రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని, ఎ.కోట మండల డిప్యూటి తహసీల్దార్ భరత్ కి, రేగపుణ్యగిరి గిరిజనులు విజ్ఞప్తి చేశారు. ఫారెస్ట్ అనుమతులు త్వరగా వచ్చేలా చేయాలని వారు కలెక్టరకి వినతిపత్రం సమర్పించారు. ఫారెస్ట్ అధికారులతో మాట్లాడాలని సమస్య పరిష్కరిస్తామని వారికి కలెక్టర్ అంబేత్కర్ హామీ ఇచ్చారు.

Share this content:

Post Comment