తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కి చెందిన టిడ్కో ఇళ్లు ఏర్పేడు మండలం, వికృతమాల పంచాయతీలో కేటాయించడం జరిగింది. వారికి ఎలాంటి సదుపాయాలు గత ప్రభుత్వంలో కల్పించలేదని, చాలా వరకు ఇళ్లు కేటాయించలేదని, దాదాపు 1800 ఇళ్లు కట్టినా కూడా కనీస వసతులు లేవని టిడ్కో ఇళ్ళ వాసులు ఈరోజు రేణిగుంటలోని పార్టీ కార్యాలయం వద్ద జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటాని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అక్కడ 7 బోర్లు ఉంటే కనీసం 2 కూడా పని చెయ్యడం లేదని, బస్ సౌకర్యం లేక స్కూల్ పిల్లలు 5 కి.మీ నడిచి వెళ్తున్నారని, వారి ప్రాంతంలో రేషన్ ఇవ్వడం లేదని, కొంత మందికి పెన్షన్ లు ఇవ్వడం లేదని, డ్రైనేజ్ కాలువలు లేవని తెలిపారు. ఈ సమస్యలను తప్పక టిడ్కో చైర్మన్ వేముల పాటి అజయ్ కుమార్, తిరుపతి ఎమ్మెల్యే, తిరుపతి మునిసిపల్ కమిషనర్ ల దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరిస్తామని వినుత ప్రజలకి హామీ ఇవ్వడం జరిగింది. త్వరలో తిరుపతి ఎమ్మెల్యేతో కలిసి టిడ్కో ఇళ్లను పరిశీలిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు మునికుమార్, వరదరాజులు తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment