సమాజానికి మీరే గౌరవం – కావాలి మాకు మీ అనుభవం

కాకినాడ సిటి: జనసేన పార్టీ కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ సూచనలతో కాకినాడ సిటిలోని సీనియర్ సిటిజన్స్ ని గౌరవించుకుని వారి అనుభవ పాఠాలతో సూచనలు కోరుతూ సమాజానికి మీరే గౌరవం కావాలి మాకు మీ అనుభవం కార్యక్రమం వాడ్రేవు లోవరాజు ఆధ్వర్యంలో శుక్రవారం 39వ డివిజన్ గాంధీనగర్ ప్రాంతంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ ప్రాంతంలోని సీనియర్ సిటిజన్ శ్రీమతి వరలక్ష్మిని కలిసి మాట్లాడుతూ మన సంస్కృతిలో పెద్దల పాత్ర ప్రస్పుటంగా కనబడుతుందనీ, పాత తరానికీ కొత్త తరానికీ వారధిలాంటి వాళ్ళు సీనియర్ సిటిజన్స్ అని గుర్తుచేసుకున్నారు. ఈతరం సిద్ధాంతాల మీద సాంకేతికత మీద ఆధారపడి ముందుకు సాగుతుందనీ అదే పెద్దలు ఆనాడు ఎలాంటి సాంకేతికత లేనిరోజుల్లో సైతం చరిత్రని దానిలోని అనుభవసారాంశాన్ని ప్రాతిపదికగా తీసుకుని అనేక కఠినమైన సమస్యలని సైతం ఓర్పుగా నేర్పుగా పరిష్కరించేవారని కొనియాడుతూ.. ప్రజలకు ఉపయోగపడే అంశాలలో మీయొక్క అనుభవాన్ని ఉపయోగించి సలహాలను, సూచనలను తమ నాయకులు పవన్ కళ్యాణ్ గారికి తెలియచేసి పార్టీని ఆశీర్వదించవలసినదిగా కోరుతూ వారికి పోస్టల్ కవర్లను అందచేసారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.