భీమ్లా నాయక్ చిత్రంపై ఆంక్షలు వైసీపీ ప్రభుత్వం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం

*జనసేన మండల నాయకులు కలవాయి విశ్వనాథ రెడ్డి, తుపాకుల భాస్కర్, గంజికుంట రామకృష్ణ, పొన్నతోట రామయ్య
*సమస్యలని సృష్టించడం, వాస్తవాలను పక్కదోవ పట్టించడం వైసీపీ ప్రభుత్వానికి వెన్నుతోపెట్టిన విద్య
*మీ కుళ్ళు రాజకీయాలకోసం అధికారులను వాడుకోవడం నీచమైన చర్య

రాష్ట్రంలో ప్రజలు సమస్యలతో అష్ట కష్టాలు పడుతుంటే వైసిపి ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెక్కనట్టు ప్రవర్తిస్తోంది, కేవలం తమ రాజకీయ లబ్ధి కోసం మాత్రమే భీమ్లా నాయక్ సినిమాపై ఆంక్షలు విధించిన ప్రభుత్వం అంతకంటే ముందు వైసిపి అనుకూల హీరోల సినిమాలకు ఈ జీవో ఎందుకు వర్తించదో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఒకవైపు మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కోర్టులో విచారణ జరుగుతుండగా ఈ హత్యలో వైసిపి పెద్ద తలకాయలు హస్తం ఉందని ఆరోపణలు బట్టబయలు అవుతున్న సమయంలో ఈ విషయాలను పక్కదోవ పట్టించడానికి కోసమే అనవసరమైన జీవోల పేరుతో లేని సమస్యలను సృష్టించి ప్రజలను పెడదోవ ప్రకటిస్తున్నారే తప్ప సీఎం గారికి చిత్తశుద్ధి ఉంటే సొంత చిన్నాన్న హత్య జరిగి దాదాపు మూడు సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు నిందితుల్ని పట్టుకోలేక పోవడం విడ్డూరం. గతంలో కూడా ఉద్యోగస్తులు పిఆర్సి సాధన కోసం నిరసన కార్యక్రమాలు చేస్తుంటే ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని భావించి అనధికార విధ్యుత్ కోతల తో పాటు, జనగణన జరగనిదే కొత్త జిల్లాల ఏర్పాటు సాధ్యం కాదని తెలిసి కూడా ప్రజలను మభ్యపెట్టడానికి కొత్త జిల్లాల ప్రకటన చేసి ఉద్యోగుల పీఆర్సీ సమస్యను పక్కదోవ పట్టించారు. రాష్ట్రములో ఇసుక మరు సిమెంట్ ఆకాశాన్నంటుతుంటే, కంపెనీలు, కొత్త నోటిఫికేషన్ లు లేక నిరుద్యోగ సమస్యతో ఆత్మహత్యలు చేసుకుంటుంటే రాజకేయన్గా ఎదురుకునే సత్తా లేక భీమ్లా నాయక్ సినిమా థియేటర్ల వద్ద పోలీస్ బలగాలను, రెవెన్యూ అధికారులను మోహరించి మీ కక్షపూరిత రాజకీయాల కోసం అధికార యంత్రాంగాన్ని వాడుకోవడం ఎంతవరకు సబబు అని అడుగుతున్నాము. గతంలో ఏ ముఖ్యమంత్రి ఈ విధంగా ప్రవర్తించలేదని, ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం కుళ్ళు రాజకీయాలకి స్వస్తి చెప్పకపోతే కచ్చితంగా ప్రజలు మీకు బుద్ధిచెప్పే సమయం ఆసన్నమైంది జనసేన పార్టీ తరపున హెచ్చరిస్తున్నామని అన్నారు.