గోదావరి నిత్యహారతి పునఃప్రారంభం

కరోనా కారణంగా నిలచిపోయిన  గోదావరి నిత్యహారతి పునఃప్రారంభమైంది.  దేవదాయ, ధర్మదాయశాఖ, బుద్ధ్ధవరపు చారిటబుల్‌ ట్రస్ట్‌ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోదావరి నిత్యహారతి గురువారం పునఃప్రారంభమైంది. 2015 జూలై 1న ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గోదావరి నిత్యహారతులను కొవిడ్‌ కారణంగా మార్చి 22 నుంచి నిలుపుదల చేశారు. శ్రీగోడాడ గోషాయి మఠం ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ పి.తారకేశ్వరరావు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. సకల శుభాలను అందించే ఈ గోదావరి నిత్యహారతి మళ్లీ ప్రారంభం కావడంతో పలువురు తిలకించారు.