అమలాపురానికి చెందిన విశ్రాంత వ్యాయామోపాధ్యాయుడు రంకిరెడ్డి కాశీ విశ్వనాధం గురువారం ఉదయం గుండె పోటుతోఅమలాపురంలో మరణించారు. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సాత్విక్ సాయిరాజ్ ఈయన కుమారుడు. ఆయన హఠాన్మరణం పట్ల పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు దిగ్భ్రాంతి చెందారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించినారు. వారిలో శాసన మండలి సభ్యులు కుడుపూడి సూర్యనారాయణ రావు, అమ్ముడా చైర్మన్ అల్లాడ స్వామి నాయుడు, కోనసీమ జిల్లా బ్యాడ్మింటన్ అధ్యక్షులు అల్లాడ శరత్, మున్సిపల్ మాజీ చైర్మన్ చిక్కాల గణేష్, కౌన్సిలర్ బొర్రా వెంకటేశ్వరరావు, ది. అమలాపురం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు బోణం సత్తిబాబు, మాజీ కౌన్సిలర్ వెలిగట్ల లక్ష్మణరావు, కంచిపల్లి అబ్బులు, పబ్బినీడి సత్యనారాయణ, కల్వకొలను వెంకటరమణ, డాక్టర్. విష్ణుమూర్తి, రవి, పచ్చిగోళ్ళ రాజా, పట్నాల రమణ మరియు పట్టణ ప్రముఖులు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు.
Share this content:
Post Comment