వినుత కోటా సమక్షంలో జనసేనలో చేరిన రిటైర్డ్ తాసీల్దారు చిట్టతూరు చంద్రశేఖర్ రావు

శ్రీకాళహస్తి, రిటైర్డ్ తాసీల్దారు చిట్టతూరు చంద్రశేఖర్ రావు జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి జన సేన పార్టీ నాయకులు కొట్టిడి మదు శేఖర్ ఆధ్వర్యంలో గురువారం శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. పార్టీలో చేరిన చంద్రశేఖర్ రావుకి శ్రీకాళహస్తి పట్టణంలోని నియోజకవర్గ కేంద్ర కార్యాలయంలో శ్రీమతి వినుత కోటా జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెవెన్యూలో ఎమ్మర్వోగా ఉన్న అనుభవంతో పార్టీ బలోపేతానికి, పేద ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చంద్రశేఖర్ రావు తెలిపారు. తాసీల్దారుగా పనిచేసిన అనుభం ఉన్న వారు పార్టీలో చేరడం శ్రీకాళహస్తిలో పార్టీ బలోపేతానికి ఉపయోగపడుతుందని వినుత సంతోషాన్ని వ్యక్తం చేసి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షుడు తోట గణేష్, తొట్టంబేడు ఇంఛార్జి పేట చంద్రశేఖర్, నియోజకవర్గ ఐటీ కోఆర్డినేటర్ కావలి శివకుమార్, నాయకులు లక్ష్మి, రాజ్యలక్ష్మి, వెంకట రమణ యాదవ్, డుమ్ము రాయల్, తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment