పదవీ విరమణ సన్మాన మహోత్సవం

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి.గన్నవరం మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన పదవీ విరమణ సన్మాన మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం ఆత్మీయతకు, గౌరవానికి ప్రతీకగా నిలిచింది. మండల అభివృద్ధి అధికారి కె.వి. ప్రసాద్ కి శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ హృద్యమైన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “ప్రసాద్ ఓ వినయశీలి, స్నేహశీలి, పుస్తక ప్రియుడు. తన నాలుగు దశాబ్దాల సేవలో ప్రతి బాధ్యతను అత్యంత క్రమశిక్షణతో, అంకితభావంతో నిర్వహించారు. ఆయన్ని చూసి కొత్తతరం అధికారులు స్ఫూర్తి పొందాలి” అని పేర్కొన్నారు. ఈ వేడుకలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, పార్టీ కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని మరింత ఘనతపరిచారు

Share this content:

Post Comment