అక్రమ కట్టడాలపై చర్యలు ఎక్కడ? .. రెవిన్యూ శాఖను ప్రశ్నించిన జనసేన మురళి

అనంతగిరి: అక్రమ కట్టడాలపై చర్యలుచేపట్టకుండా రెవిన్యూ శాఖ నిద్రపోతున్నదని జనసేన మురళి ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగంలో షెడ్యూల్డ్ ప్రాంతాలుగా గుర్తించబడిన భూభాగంను ప్రత్యేకమైన భూభాగంగా పరిగణిస్తూ ఆర్టికల్ 242 క్లాజ్ 1 ప్రకారం స్థానిక గిరిజనుల సుస్థిరమైన అభివృద్ధిని కాంక్షిస్తూ గిరిజన ప్రాంతంలో గల ఆదివాసుల భూ పరిరక్షణ నిమిత్తం భూ బదలాయింపు నిరోధక చట్టం 1/70 చట్టం అమలులోకి తీస్కొని వచ్చి పట్టిష్టంగా అమలు చేసి మన్య ప్రాంత భూములను పరిరక్షించే బాధ్యత రెవిన్యూ శాఖ అధికారులకు మరియు సమీకృత గిరిజన అభివృధి సంస్థ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ వారాలకు ఇచ్చీయున్నారు. షెడ్యూల్డ్ తెగల భూముల క్రయ విక్రయాలు స్థానిక గిరిజనుల మధ్య మాత్రమే జరగాలనే నిబంధన ఉన్నప్పటికీ యధేచ్చగా మన్య ప్రాంతంలోని భూములు గిరిజనేతరులకు విక్రయించడం, బినామీ పేరిట భూ బదలాయింపు చట్టం ను నిర్వీర్యం చేయడం షెడ్యూల్డ్ ప్రాంత చట్టాలను ఉల్లంఘించడం అటువంటి వారికి రెవిన్యూ అధికారులు తో పాటు స్థానిక గిరిజన నాయకులు సమర్ధించడం చాలా బాధాకరమైన విషయం. షెడ్యూల్డ్ ప్రాంతంలో ఉండే ఆదివాసుల భూములను మైదాన ప్రాంతం నకు చెందిన గిరిజనులు అయినప్పటికీ క్రయ, విక్రయాలు జరుపుటకు వీలు లేదు అనే నిబంధన ఉంది. మన్య ప్రాంతంలో ఉండే ప్రత్యేక చట్టాలైన 1/70 భూ బదలాయింపు చట్టం, పీసా చట్టం, అటవీ హక్కుల చట్టం మొదలైన చట్టాలను తూట్లు పొడుస్తూ స్వయానా రెవిన్యూ శాఖ అధికారులే చట్టాలలో ఉన్న లొసుగులను గిరిజ నేతరులకు తెలియపరచి అమాయక గిరిజనులకు ధన ప్రలోభాలకు గురి చేసి వారిని పావులుగా వాడుకొని బినామీ వ్యవస్థ ను ప్రోత్సహించడం చాలా దౌర్భాగ్యం, హేయమైన చర్య ఆదివాసుల పక్షాన నిలబడి న్యాయం చేయవలసిన అధికారులే గిరిజనులకు అన్యాయం చేయుచున్నారు. నేడు షెడ్యూల్డ్ ప్రాంతంలో అనేక చోట బినామీ పేరిట గిరిజనులు అక్రమ భూ క్రయ, విక్రయాలు, అక్రమ కట్టడాలు యధేచ్చగా జరుపుచున్నప్పటికి ప్రశ్నించే నాధులు లేకుండా పోయారు. వాల్టా చట్టం అనుసరించి గిరిజన ప్రాంతాల్లో చెట్లు తొలగించాలన్న, బోరేవెల్ డ్రిల్ చేయాలన్న, భూమిని (మట్టిని) త్రవ్వాలన్న, భూమి కన్వర్షన్ పెట్టకోవాలన్న రెవిన్యూ అధికారుల అనుమతి కచ్చితంగా పొందాలి మరీ గిరిజన నేతరులు చెప్పట్టియున్న అక్రమ నిర్మాణాలు ఏ విధమైన అనుమతులు కలిగి నిర్మాణాలు చెప్పట్టియున్నారు. పంచాయితీ రాజ్ చట్టం ప్రకారం ఒక గ్రామంలో ఏవిధమైన నిర్మాణాలు చెప్పట్టలన్న గ్రామ పంచాయితీ తీర్మానం తప్పనిసరి వీటితో పాటు పీసా కమిటీ తీర్మానం చాలా ప్రాముఖ్యం కానీ చట్టాలను, నిబంధనలను విస్మరించి చట్టాలను వారి చుట్టలుగా మలచుకొని అధికారులు, ప్రజాప్రతినిధుల కళ్ళ ముందర అక్రమ కట్టడాలు జరుగుతున్నాయి అంటే అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు వారి వ్యక్తిత్వాన్ని అమ్ముకొని ప్రలోభాలకు అమ్ముడుపోయి ఆదివాసులకు అన్యాయం చేయుచున్నారు. అనంతగిరి మండల పరిధిలో అనేక అక్రమ కట్టడాలు మరియు బినామీ పేర్లతో క్రయ విక్రయాలు జరుగుతున్నప్పటికీ, ఆదివాసుల భూములలో అక్రమ మైనింగ్ ద్వారా గిరిజనులను దోచుకు పోతుంటే అధికారులు గానీ స్థానిక ప్రజా ప్రతినిధులు స్పందించకపోవడం చాలా బాధాకరం. మండల కేంద్రం నందే ఒక గిరిజ నేతరుడు బినామీ పేరిట ఒక ప్రభుత్వ స్థలంలో చట్టాలను ఉల్లంఘించడం తో పాటు స్థానిక గిరిజనులకు సవాళ్లు విసిరి యధేచ్చగా నిర్మాణం చేపడుతుంటే ఎన్నిసార్లు రెవిన్యూ అధికారులకు, పంచాయతీ అధికారులకు గిరిజనులు విన్నవించుకునప్పటికి గిరిజన నేతరులకు వత్తాసు పలుకుతున్నారు. స్థానిక గిరిజనుల కు కనీసం నివాసం గృహాలు నిర్మించుట కొరకు స్థలం లేక ఇబ్బందులు పడుతుంటే స్థానిక గిరిజనుల కు ప్రభుత్వ భూమిని కేటాయించ వలసిన వారే ప్రభుత్వ స్థలం గిరిజ నేతరల చే ఆక్రమణకు గురై అక్రమ కట్టడాలకు అధికారులు ప్రోత్సహించడం విడ్డూరం. ఆదివాసుల ప్రత్యేక చట్టాలైన 1/70 భూ బదలాయింపు నిరోధక చట్టం, పీసా చట్టం కచ్చితంగా అమలు చేయాలని స్థానిక గిరిజనుల అభ్యర్థన మేరకు తక్షణమే అక్రమ కట్టడాలు, నిర్మాణాలను నిలుపుదల చేయాలని డిమాండ్ చేయడమైనది అనేక మార్లు అధికారులకు తెలియజేసిన పట్టించుకోకపోవడం గిరిజనుల ఆత్మాభిమానం లను చులకన చేయడం చాలా తీవ్రమైన చర్య. కావున షెడ్యూల్డ్ ప్రాంతంలో భినామి వ్యవస్థ పైన సమగ్ర కార్యాచరణ తో విచారణ జరిపి, గిరిజ నేతరుల అక్రమ కట్టడాలు, క్రయ విక్రయాలను నిరోధించి షెడ్యూల్డ్ ప్రాంతంలో గిరిజన చత్తాలైన 1/70, పీసా చట్టం, అటవీ హక్కుల సంరక్షణ చట్టాలను పట్టీష్టంగా అమలు చేసి గిరిజనుల మాన, ప్రాణ, ధన, అస్తిత్వలను కాపాడాలని అన్యాక్రాంతం అవుతున్న గిరిజన భూములకు రక్షణ కల్పించవలసినదిగా ఆదివాసులు కోరడమైనది. మన్య ప్రాంతంలో మరొక మణిపూర్ రాష్ట్ర ఉద్యమ వ్యతిరేకతకు కారకులు కాకుండా చూడాలని రెండు చేతులు జోడించి అధికారులను ప్రజా ప్రతినిధులకు కోరడమైనది.అన్ని జనసేన మురళి తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన వీరమహిళ రత్న ప్రియా పాల్గొన్నారు.