కాకినాడ కంట్రోల్ రూమ్‌లో సమీక్షా సమావేశం..!

కాకినాడ, జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా కాకినాడలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ వద్ద జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సోమవారం క్రౌడ్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులతో సమావేశమవడం జరిగింది. ఈ సందర్భంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకల కార్యాచరణ, క్రౌడ్ మేనేజ్మెంట్, ఏర్పాట్లు తదితర అంశాలపై క్రౌడ్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులతో సుదీర్ఘంగా చర్చించి, అవసరమైన సూచనలు, మార్గదర్శకాలను చర్చించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ మరియు జనసేన పార్టీ ఎమ్మెల్సీ పిడుగు హరి ప్రసాద్, స్టేట్ ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ కళ్యాణం శివ శ్రీనివాసరావు, జనసేన పార్టీ శాసనసభ సభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, పత్సమట్ల ధర్మరాజు, జనసేన పార్టీ ఉమ్మడి కడప జిల్లా కోఆర్డినేటర్, కడప అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ మరియు ఆవిర్భావ క్రౌడ్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు సుంకర శ్రీనివాస్ ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment