జనసేన ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లపై సమీక్ష

కాకినాడ: మార్చ్ 14న జరగబోయే జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల నేపథ్యంలో, కాకినాడ కంట్రోల్ రూం వద్ద జనసేన పార్టీ ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ ని మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన పార్టీ ఉమ్మడి కడప జిల్లా కోఆర్డినేటర్, కడప అసెంబ్లీ ఇంచార్జ్, రాష్ట్ర క్రౌడ్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు సుంకర శ్రీనివాస్ పార్టీ కార్యాచరణపై చర్చించారు. ఆవిర్భావ సభ ఏర్పాట్లు మరియు క్రౌడ్ మేనేజ్మెంట్ విజయవంతమైన సభ నిర్వహణ కోసం ముఖ్య సూచనలు, సలహాలు పార్టీ కార్యకర్తల సమీకరణ మరియు సంఘటన ప్రణాళికలు ఈ సమావేశంలో ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా విజయవంతం చేయాలన్న లక్ష్యంతో పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని చారిత్రాత్మకంగా చేయడంలో ప్రతి కార్యకర్త తన వంతు బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.

Share this content:

Post Comment