రేవినిశెట్టి సత్యనారాయణ మరణం తీరని లోటు

నీజివీడు, జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు, కాపు సంక్షేమ సేన రైతు సంఘం అధ్యక్షులు రేవినిశెట్టి సత్యనారాయణ ఆకాల మరణం నూజివీడు నియోజకవర్గ జనసేన పార్టీకి తీరని లోటని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మండలి రాజేష్ అన్నారు. శుక్రవారం అగిరిపల్లి మండలంలోని సగ్గురు గ్రామంలో ఆయన పార్ధివదేహానికి మండలి రాజేష్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు తన ప్రగాడ సానుభూతిని మండలి రాజేష్ తెలియజేశారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన నాటి నుంచి ఎంతో కీలకంగా పనిచేశారు. కాపులలో ఐక్యమత్యం తీసుకురావడం కోసం కాపు సంక్షేమ సేనలో కూడా సేవలందించారని, ఆ తర్వాత జనసేన పార్టీకి ఆకర్షితులై జనసేనాని ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చిన నిస్వార్ధంగా పాల్గొని జనసేన పార్టీని బలోపేతానికి అవిశ్రాతంగా కృషి చేసిన వ్యక్తి రేవినిశెట్టి సత్యనారాయణ అని రాజేష్ తెలియజేశారు. ప్రత్యర్ధులకు తన వాగ్ధాటితో బలంగా సమాధానం చెప్పేవారని, అలాంటి వ్యక్తి ఈ రోజున మన మధ్యన లేకపోవడం జనసేన పార్టీకి తీరని లోటన్నారు.ఈ కార్యక్రమంలో నూజివీడు, గన్నవరం నియోజకవర్గాల సమన్వయకర్తలు బర్మా ఫణిబాబు, చలమలశెట్టి రమేష్, ఉమ్మడి కృష్ణాజిల్లా అధికార ప్రతినిధి మరీధు.శివరామకృష్ణ, జిల్లా కార్యదర్శి బండ్రెడ్డి రవి, జిల్లా సంయుక్త కార్యదర్శి రెడ్డి మణి, నూజివీడు మండల అధ్యక్షులు యర్రంశెట్టి రాము, గరికపాటి శివ శంకర్, విజయవాడ రూరల్ మండల అధ్యక్షులు పొదిలి దుర్గారావు, మండల అధ్యక్షులు వడ్డే శివ నాగేశ్వరరావు, దుర్గగుడి ధార్మిక మండలి సభ్యురాలు నీట్లా ఉమామహేశ్వరి, కూనపురెడ్డి రమేష్, ముత్యాల కామేష్, సునీల్ కుమార్, పాతూరి రవి, కోదండపాణి తదితరులు పాల్గొన్నారు.