టీపీసీసీ చీఫ్​ గా బాధ్యతలు చేపట్టిన రేవంత్​

తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(టీపీసీసీ) అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. గాంధీభవన్‌లో ఆయన ఉత్తమ్‌కుమార్‌ నుంచి పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు. కార్యక్రమంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, గీతారెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకముందు రేవంత్‌ జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ గుడిలో పూజలు చేశారు. అనంతరం కార్యకర్తలతో నాంపల్లిలోని దర్గాకు ర్యాలీగా బయలురి అక్కడ చాదర్ సమర్పించారు. అక్కడి నుంచి గాంధీ భవన్‌కు చేరుకున్న రేవంత్‌ బాధ్యతలు చేపట్టారు.