మార్కాపురం జిల్లా సాధనకై జెఎసి ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్ష

మార్కాపురం ప్రత్యేక జిల్లా చేయాలనీ కోరుతూ మార్కాపురం జిల్లా సాధన సమితి జేఏసీ ఆధ్వర్యంలో ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం ఎదుట జేఏసీ వైస్ చైర్మన్ మరియు జనసేనపార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాధ్ రిలే నిరాహారదీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇమ్మడి కాశీనాధ్ మాట్లాడుతూ..రాష్ట్రంలోనే అన్ని విధాలుగా వెనుకబడిన ప్రాంతం పశ్చిమ ప్రకాశంలోని మా మార్కాపురం కావున మార్కాపురం జిల్లా కేంద్రంగా అవ్వటానికి అన్ని విధాలుగా సరైన ప్రాంతమని, జిల్లాగా ఏర్పడకపోతే ఈ పశ్చిమ ప్రాంతం అభివృద్ధికి మరింత దూరం అవుతుందని, ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజల అభీష్టాన్ని పరిగణలోకి తీసుకొని జిల్లాగా ప్రకటిస్తే, ఈ ప్రాంతవాసులకు మరింత మేలు చేసిన వారవుతారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ ప్రకాశం జిల్లా నాయకులు, జనసేన పార్టీ ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్, రాష్ట్ర జనసేన పార్టీ అధికార ప్రతినిధి అరుణ రాయపాటి, ఒంగోలు నగర జనసేన పార్టీ అధ్యక్షులు మలగా రమేష్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శులు రాంబాబు చనపతి, కళ్యాణ్ ముత్యాల, ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శులు కందుకూరి వాసు, పల్ల ప్రమీల, బొందిలి శ్రీదేవి, ఒంగోలు నగర జనసేనపార్టీ కార్యదర్శులు శివ, నారాయణ, నరేంద్ర వేంప, గోవింద్ కోమలి, ఇర్ఫాన్, ఒంగోలు నగర జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శులు ఆకుపాటి ఉష, 25వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు పోకల నరేంద్ర, 28వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు కోట సుధీర్ ఇమ్మడి కాశీనాధ్ చేస్తున్న రిలే నిరాహారదీక్షలకు సంఘీభావం తెలియజేసి మద్దతుగా దీక్షలో కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి తిరుమలశెట్టి వీరయ్య, శిరిగిరి శ్రీనివాసులు, పొదిలి మండల అధ్యక్షులు పెరుసోముల శ్రీనివాసులు, రత్న కుమార్, జిల్లా లీగల్ సెల్ సంయుక్త కార్యదర్శి శైలజ, పిన్నెబోయిన శ్రీను, రామిరెడ్డి, పోటు వెంకటేశ్వర్లు, వీరిశెట్టి శ్రీను, వెంకట్, జనసేన కార్యకర్తలు మరియు జిల్లా సాధన సమితి నాయకులు పాల్గొన్నారు.

This image has an empty alt attribute; its file name is WhatsApp-Image-2022-03-30-at-2.20.49-PM-1024x461.jpeg