43వ రోజుకి చేరిన రిలే నిరాహారదీక్ష

ఇచ్చాపురం, బెంతో, ఒరియ, గిరిజనుల రిలే నిరాహారదీక్షలు 43వ రోజుకి చేరాయి. దీక్షలో ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. శిబిరంలో వారు మాట్లాడుతూ ఇచ్ఛాపురం నియోజకవర్గం అత్యంత వెనుకడినదని ఈ నియోజకవర్గంలో గల బెంతో ఒరియ గిరిజనులు అన్ని రంగాలలో అత్యంత వెనుకబాటుతనంతో పాటు జరుగుబాటుకి కూడా నోచుకోక ఎటువంటి ప్రభుత్వ పధకాలకు అర్హులుగా పొందకపోవడానికి కారణం కులధృవీకరణ పత్రాలు అకారణంగా రెవెన్యూ అధికారులు కొందరి స్వార్థరాజకీయ నాయకుల ఒత్తిడితో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఆదేశాలు లేకుండా కులధ్రువ పత్రాలు నిలుపుదల చేయడం అని వ్యక్త పరిచారు. ఇక్కడ నిజమైన మా బెంతో ఒరియ గిరిజన పిల్లలు చదువులో నైపుణ్యం ఉన్నా కుల గుర్తింపు లేనందు వల్ల ఇబ్బంది పాలవుతున్నారు అని, ఉపాధి లేక ఉన్నత విద్యను చదివే అవకాశం లేక ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లి కూలి పని చేస్తున్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కును రాజకీయం చేయడం సరికాదని స్వతంత్రం వచ్చి 7దశాబ్దాలు అయినది అని కమిషన్ పేరిట కాలయాపన చేసి మా భవిష్యత్తుతో ఆడుకోవద్దని తమ పిల్లలు చాలా నష్ట పోయారని ఇకనైనా పాదయాత్రలో మానిక్యపురంలో ఇచ్చిన హామీ నిలబెట్టలని కులదృవ పత్రాలు పునరుద్దరణ చేసి శాశ్వత పరిష్కారంతో న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో దయానిధి బిసాయి,హెమసుందర్ బిసాయి, ఢిల్లీ దలయి, మోహన్ బిసాయి, దుదిస్టి సాహు, భిమ్మో సాహు, ఖేత్రో బిసాయి,నిరంజన్ సాహు, రాజు సాహు, ప్రభా బిసాయి, భిమ్మో దలై, సత్యన్నారాయణ, బృందావన్, జయసేన్, దుదిస్టి పాల్గొన్నారు