పెరుగుతున్న కరోనా కేసులు.. తెలంగాణా సర్కార్ కీలక నిర్ణయం !

తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ తో DM అండ్ HO ల టెలి కాన్ఫరెన్స్ కొద్దిసేపటి క్రితమే ముగిసింది.

10 ఆ పైన బెడ్స్ ఉన్న ప్రతి ప్రైవేట్ హాస్పిటల్ లో కరోనా ట్రీట్మెంట్ అందించాలని నిర్ణయం తీసుకున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 1691 నర్సింగ్ హోమ్స్ ఉన్నాయి అందులో 41 వేల బెడ్స్… ఉన్నాయని చెబుతున్నారు. వీటిలో ఆక్సిజన్ ఫెసిలిటీ ఉన్న బెడ్స్ 10వేలు కాగా.

5వేల ICU బెడ్స్, 1500 వెంటిలేటర్ బెడ్స్ అందుబాటులో ఉన్నాయని తేల్చారు. ఇక DM అండ్ HO లకు అనుమతిస్తూ ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది.