జనసేనాని పుట్టిన రోజు సందర్భంగా రోడ్ మరమ్మతులు

తుని నియోజకవర్గం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా తొండంగి మండలం, అనూరు సీనియర్ నాయకులు బిరుసు ఈశ్వరరావు అధ్వర్యంలో అనూరు గ్రామం నుంచి ఎదటం గ్రామం కలిపే ఒక కిలమీటరు రోడ్ కొన్ని సంత్సరాలుగా మరమ్మతు పనులుకు నోచుకోలేదు. గతంలో పంచాయతీ అధికారులకు చెప్పినా సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టలేదు. పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజు బహుమతిగా అనురు ప్రజలకు జనసైనికుల సహకారంతో బిరుసు ఈశ్వరరావు స్వయం పర్యవేక్షణలో గుంతలు పూడ్చి రోలర్ తో చదును చేసి రోడ్ అందుబాటులోకి తీసుకుని వచ్చారు.