వీరఘట్టం మండలంలో రోడ్ పనులు పూర్తి చెయ్యాలి

పాలకొండ నియోజకవర్గం: జనసేన జానీ మాట్లాడుతూ వీరఘట్టం మండలంలో గత నాలుగు సంత్సరాలు క్రితం రోడ్ వెడల్పు పేరుతో షాప్స్ కొట్టడం జరిగింది. ఎవరి షాప్లను వారు, ఎవరి ఇల్లు లను వారే కొట్టుకునేవిధంగా చేసినా నేటికీ పనులు పూర్తి స్థాయిలో జరగకపోవడం వలన ప్రజలు చాలా త్రివ్రమైన ఇబ్బందులకు గురువ్వుతున్నారు. కనీసం వీరఘట్టం పోలీస్ స్టేషన్ కి పోలీస్ వారి వాహనం వెళ్ళడానికి కూడా సరైన దారి లేకపోవడం ఈ అంబేద్కర్ జంక్షన్ లో భారీవాహనాలు టర్నింగ్ చెయ్యడానికి కూడా అవ్వక ఎవ్వరిమీదకు ఏ వాహనం వచ్చేస్తుందో అనే భయం ఒక పక్కన రోడ్ మీద ఉండే రాళ్లు వాహనాల తాకిడికి పైకి లేస్తూ ప్రజలు కి గాయాలు కూడా అవ్వుతున్నాయి కనుక తొందరగా ఈ రోడ్ పని పూర్తి చెయ్యాలి అని ప్రభుత్వం నాయుకులను కోరుకుంటున్నాం లేని పక్షంలో జనసేన టీడీపీ పార్టీల ఉమ్మడిగా ధర్నా మరియు దీక్ష చెయ్యడానికైనా ప్రజలు కోసం సిద్ధంగా ఉంటాం అని ఈ సందర్బంగా జనసేన జానీ అంటూ పూర్తి చెయ్యలేని పక్షంలో జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పాడ్డాకా ముందుగా ఈ యొక్క వీరఘట్టం రోడ్ పూర్తి చేస్తాం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సరిపల్లి అచ్యుత్ రావు, శివ్వాల గోపి పాల్గొన్నారు.