రహదారులు – భవనాల శాఖ పిఠాపురం వారికి వినతిపత్రమిచ్చిన డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం, బ్రిడ్జ్ నిర్మాణం తక్షణమే పూర్తి చేయాలి పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు డాక్టర్ శ్రీధర్ పిల్లా, పిఠాపురం నుండి సామర్లకోట వెళ్ళు రహదారి మధ్యలో ఉన్నటువంటి బ్రిడ్జ్ కూలిపోయి దాదాపు మూడు సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాలేదు. దీనికి స్పందించిన డాక్టర్ శ్రీధర్ పిల్లా గారు మీడియా సమక్షంలో మాట్లాడుతూ పిఠాపురం నుండి సామర్లకోట వెళ్లే ముఖ్య రహదారి కొన్ని వేల మంది రైతులకు కొన్ని వేల మంది ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తక్షణమే బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని జనసేన పార్టీ తరపున పిఠాపురం పట్టణమందు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ వారి కార్యాలయం రహదారులు – భవనాల శాఖ పిఠాపురం వారికి వినతి పత్రం అందించి నిరసన తెలుపుతూ డిమాండ్ చేయడం జరిగింది. ఈ రహదారి రెండు నియోజకవర్గాలను కలుపు ముఖ్య రహదారి, చిరి వ్యాపారస్తులు, రైతులు, ఉద్యోగస్తులు, ప్రయాణీకులు ఆటో సోదరులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు, ఈ బ్రిడ్జ్ కూలిపోవడం వల్ల ఇతర రాష్ట్రాల నుండి శ్రీపాద వల్లభ దేవస్థానాన్ని దర్శించుకోవడం కోసం వచ్చేటువంటి వేలాది భక్తులు కూడా రోడ్ల వల్ల ఇబ్బందులు పడుతున్నారని మన రాష్ట్ర రోడ్ల దుస్థితిని ఇతర రాష్ట్రాలకు కూడా వ్యాప్తింపచేసేలా ఉందని వాపోయారు. రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రివర్యులు దాడిశెట్టి రాజా సొంత జిల్లా వారు అయినప్పటికీ ఈ రోడ్లను పట్టించుకోనటువంటి దుస్థితిలో ఉన్నారని చెప్పడం జరిగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని తిట్టడం మీద ఉన్న శ్రద్ధ తన మంత్రిత్వ శాఖ మీద పెట్టి, తక్షణమే బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి బ్రిడ్జ్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని డాక్టర్ శ్రీధర్ పిల్లా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరిగింది. ఈ మంత్రిత్వ శాఖలో మంత్రులందరూ జగన్మోహన్ రెడ్డికి జింగ్ చకా జింగ్ చకా జింగ్ చకా అంటూ భజన చేసుకుంటూ ఆయా మంత్రిత్వ శాఖలోని మంత్రులు అందరూ ఎంత ప్యాకేజీలకు అమ్ముడుపోయారని నేను ఈరోజు అడుగుతున్నాను అంటూ డాక్టర్ శ్రీధర్ పిల్లా మీడియా ముందు ఫైర్ అయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా బత్తిన వీరబాబు, కొండపల్లి శివ, ముమ్మిడి సత్తిబాబు, వెన్న సుబ్బారావు, కే చిన్ని, జల్లురు చక్రి, కేశిరెడ్డి బుల్లి రాజు, వాకపల్లి సూర్య ప్రకాష్, సైతన బాబ్జి, సైతన రాజబాబు, గుర్రం గణేష్, పిల్ల శ్రీను, జి శ్రీను, అప్పారావు, మాస పెద్దపత్రయ్య, మాస చిన్నపత్రయ, మల్లవరపు వీరబాబు, కాపారపు బుల్లిఅప్పారావు, మాస అప్పారావు, కన్నా బత్తుల జీవరత్నం, పసుపులేటి అప్పారావు, పళ్ళవలస రవి, మరియు జన సైనికులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.