వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మత్తులు చేపట్టాలి: అనిల్ రాయల్

ఆత్మకూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జి నలిశెట్టి శ్రీధర్ ఆదేశాల మేరకు చేజర్ల మండల ఇంచార్జ్ బండి అనిల్ రాయల్ స్థానిక సైనికులతో కలిసి వరదల కారణంగా పుట్టుపల్లి గ్రామంలో దెబ్బతిన్న రోడ్లను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా అనిల్ రాయల్ మాట్లాడుతూ పుట్టుపల్లి గ్రామం నుండి చేజర్ల వెళ్లే రహదారి ఇంతకుముందు ఇసుక లారీలు తిరగడం వల్ల దెబ్బతిందని అదేవిధంగా మొన్న వచ్చిన భారీ వరదల కారణంగా పూర్తిగా దెబ్బతిందని మాట్లాడుతూ, ఈ సమస్య మీద ఇంతకుముందు ఒకసారి ఎంపిడిఓ దృష్టికి స్థానిక జనసేన నాయకులతో కలిసి తీసుకువెళ్లడం జరిగిందని అయినప్పటికీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నారని తెలియజేస్తూ మరోసారి ఈ సమస్యను ప్రభుత్వం మరియు అధికారుల దృష్టికి తీసుకొస్తున్నామని, వరదల కారణంగా దెబ్బతిన్న పుట్టపల్లి రోడ్డుకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆత్మకూరు నియోజకవర్గం చేజర్ల మండల జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేశారు. ఈసారి ప్రభుత్వము మరియు అధికారులు ఈ సమస్య మీద సానుకూలంగా స్పందించకపోతే జనసేన పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపడతామని అప్పటికీ స్పందించకపోతే ఎంపిడిఓ ఆఫీస్ ని ముట్టడించడానికి వెనుకాడబోమని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఉపాధ్యక్షుడు నాగరాజు యాదవ్ మండల ఉపాధ్యక్షులు ప్రసాద్, హరిబాబు కార్యదర్శులు షరీఫ్ అరవింద్ రాయల్, హజరత్ మరియు తదితర జనసైనికులు పాల్గొన్నారు.