రైతు భరోసా యాత్ర స్టిక్కర్లను ఆవిష్కరించిన రొద్దం జనసేన

అనంతపురం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కౌలు రైతుల సంక్షేమ ఆశయ సాధన కోసం చేస్తున్న జనసేన రైతు భరోసాయాత్రను ప్రజల్లోకి తీసుకువెళ్ళే దిశగా ఆటో స్టిక్కర్లు, వాల్ పోస్టర్లు, రొద్దం మండల జనసేన పార్టీ అధ్యక్షులు యు గంగాధర్ సహకారంతో రొద్దం మండల జనసైనికుల ఆధ్వర్యంలో సోమవారం మండలంలోని కలిపి గ్రామ పంచాయితీ, మరువపల్లి, కలిపి, శేషపురం, బుదిపల్లి, చోలేమర్రి పెద్దమంతురు పంచాయితీ పెద్దమంతురు, పి.రోప్పాలు, పి.కొత్తపల్లి, లోచర్ల మరియు తదితర గ్రామాల్లో పర్యటించి పోస్టర్లను అతికించి అక్కడున్న ప్రజలతో మమేకమై వారికి జనసేనాని పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి రైతుభరోసా యాత్ర గురించి వివరించడం జరిగింది. అలాగే గ్రామాల్లో సమస్యలను తెలుసుకోనీ జనసేన పార్టీ ఎప్పుడు ప్రజలకి అండగా ఉంటుందని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గంగాధర్ మండల నాయకులు గంగాధర్, సోమశేఖర్ లోచర్ల మారుతీ, బాలాజీ, అరుణ్ కుమార్, బుచర్ల శీను, రెడ్డిపల్లి వెంకటేష్, మేపూర్లపల్లి గిరీష్, డి.రంగాపురం సోమశేఖర్, మధు, జగదీష్, చోలేమెరి వెంకటేష్, గబ్బర్ సింగ్ నగేష్, అనిల్, నల్లూరు నరసింహ మూర్తి, కలిపి పంచాయతీ నాగభూషణ, మూర్తి, ఓబులేష్, తిరుపతి, వివేక్, రాఘవేంద్ర రావు, చిన్నమంతురు హరీష్, ప్రసాద్, అభి, చిరు, రామాంజి, విజయ్, చేరకూరు చలపతి, వెంకటేష్, ముత్యాలప్ప, నవీన్, ఆది, హరినాథ్, కొత్తపల్లి రామాంజి, అనిల్, నరసింహా మూర్తి, రొద్దం గంగాధర్, చంద్ర, పవన్, మూర్తి తదితరులు పాల్గొన్నారు.