రోజా అవ్వ జనసైనికులకు క్షమాపణ చెప్పాలి..!!

  • మీ 150 సినిమాల రెమ్యునరేషన్ మా పవన్ కళ్యాణ్ మొదటి రోజు మొదటి షో అదాయంతో సమానం – గతంలో మా కాన్వాయ్ లపై అన్నప్పుడు లేదా!!
  • మేము పిల్ల వెధవలమైతే – మీరు పెద్ద వెధవలా..!!
  • జనసైనికుల డిమాండ్

తిరుపతి, రెచ్చిపోయిన వైసిపి ఎంపీ గోరంట్ల మాధవ్ విషయం పై ఆదివారం మంత్రి రోజా వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి ఇంటివద్ద తమ జనసైనికులను పిల్ల వెధవలని రెచ్చగొట్టే , వ్యాఖ్యలు చేశారని జనసేన నేతలు తిరుపతి అసెంబ్లీ ఇన్చార్జి కిరణ్ రాయల్, నగర అధ్యక్షులు రాజారెడ్డి, ఆకేపాటి సుభాషిని, కీర్తన, అమృత, సుమన్ బాబు, లక్ష్మి, కోకిల లతో కలిసి సోమవారం మీడియా సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

తిరుపతి జనసేన అసెంబ్లీ ఇన్చార్జి కిరణ్ రాయల్ రాయల్ మాట్లాడుతూ తాము పిల్ల వెదవలు అయితే వైసిపి వారు పెద్ద వెధవలని విమర్శించారు, వెంటనే మంత్రి రోజా జనసైనికులకు క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో రోజా గుట్టు రట్టు చేస్తామని హెచ్చరించారు. సినిమాల్లో కూడా ఐరన్ లెగ్ అని రోజా ను పక్కన పెట్టారన్నారు, జబర్దస్త్ లో కూడా అవకాశాలు లేవని, అలాంటప్పుడు రోజా కొన్న బెంజ్ కారు అక్రమార్జనేనని ఆరోపించారు. టూరిజం శాఖ మంత్రి గా తిరుమలకు మాత్రమే పరిమితం చేసుకున్న రోజా కు సక్రమార్జన ఎలా వస్తుందని ఎద్దేవా చేశారు. మా జనసేనాని పవన్ కళ్యాణ్ మొదటి రోజు మొదటి షో కలెక్షన్ రోజా 150 చిత్రాల కలెక్షన్ కి సమానం అని గుర్తు చేశారు. మా జనసైనికులను విమర్శిస్తే చిత్తూరు జిల్లాలో మరియు తిరుపతిలో రోజాను తిరిగనివ్వమని, మీరు అన్న పిల్ల వెధవల సత్తా చూస్తారని, వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.