రోజాను తరిమి తరిమి కొడతాం!.. జనసేన వీరమహిళల హెచ్చరిక..!

తిరుపతి: అదుపు లేని నోటితో తమ జనసేనానినిపై ఇష్టం వచ్చినట్లు విమర్శిస్తున్న, మంత్రి రోజా ఈ వారంలో తిరుపతిలో ఓ ఓపెనింగ్ కు విచ్చేయనున్న రోజాను అడ్డుకొని తరిమి తరిమి కొడతామని, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటీ సుభాషిణీ, వీరమహిళలు కర్ణం లక్ష్మి, నవ్య రెడ్డి, చందన, విజయ రెడ్డిలతో కలిసి వారు హెచ్చరించారు.. శుక్రవారం ప్రెస్ క్లబ్లో మీడియా ముందు ఆకేపాటీ మాట్లాడుతూ, తమ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి వాహన ప్రారంభ పూజ కార్యక్రమం ను విమర్శిస్తూ, టిడిపితో సీట్లు, బిజెపి మ్యాపులను తమ జనసేనాని ఫాలో అవుతున్నారని, మంత్రి రోజా మాట్లాడడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.. దమ్ముంటే తమ పవన్ ప్యాకేజీ తీసుకున్నాడని నిరూపించాలని రోజాతో సహా పవన్ ను విమర్శించే వారికి సవాల్ విసిరారు, ఎంగిలాకుల రోజా ఎగిరెగిరి పడుతున్నదని, అలాగే రోజా తో పాటు మంత్రులు సజ్జల, బొత్సలు నోరు అదుపులో పెట్టుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఊళ్ళు తిరిగే రోజాకు సీఎం జగన్ పర్యాటకశాఖని ఇవ్వడంలో ఒళ్ళు అమ్ముకునే శ్రీరెడ్డికి, నోరు అమ్ముకునే రోజాకు పెద్ద తేడా లేదని వ్యంగ్యాస్త్రాలు విసిరారు, 2014లో రోజాకు వైకాపాలో సీటు ఇవ్వరని, చివరికి తిరుపతికి వారాహి వస్తే తమ పవన్ని రోజా జనసేన పార్టీలో సీటు అడిగే దుస్థితికి దిగజారుతుందని, గతంలో రోజా బతుకు టిడిపిలో ఉండి వైసిపిని తిట్టడం, నేడు వైకాపాలో ఉంటూ ప్రతిపక్షాలను తిట్టడం పట్ల రోజా భవిష్యత్తును ఏకీపారేశారు.. ఇక సహించేది లేదని రోజా ఎక్కడ కనిపిస్తే అక్కడ తరిమి కొడతామని వారు హెచ్చరించారు.