ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ డేట్ మళ్ళీ మారింది… అఫీషియల్

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు… అజయ్ దేవగన్, అలియాభట్ కూడా నటిస్తున్నారు. అలాగే శ్రీయ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ కనిపించబోతున్నారు.ఇప్పటికే ఈ ఇద్దరికీ సంబంధించిన టీజర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఇదిలా ఉండగా గతంలో ఈ సినిమాని దసరా కానుకగా రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. కాగా తాజాగా కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తూ సరికొత్త పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్.

జనవరి 7 2022న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇక ఈ పోస్టర్ లో రాంచరణ్ పోలీస్ గెటప్ లో కనిపించారు. అలాగే ఎన్టీఆర్ రౌద్రంగా చూస్తూ కొమరం భీమ్ గెటప్ లో కనిపించారు.