బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి రూ.5 లక్షల విరాళం

*సేవామార్గంలో ముందుండే జనసేన మహిళా నేత స్వాతి రెడ్డి

తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ మహిళా నాయకురాలు శ్రీమతి స్వాతి రెడ్డి బల్కంపేట యల్లమ్మ దేవస్థానం నిత్య అన్నదాన ట్రస్టుకు రూ.5 లక్షలు విరాళంగా అందజేశారు. అన్నదానంతో ఆకలితో ఉన్నవారికి ఉపశమనం కలుగుతుందని పేర్కొన్న ఆమె, భక్తుల అవసరాలకు ఈ నిధులు ఉపయోగపడతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. అన్నదానంతో పాటు సేవా కార్యక్రమాలను విస్తరించాలని ఆకాంక్షించిన ఆమె, జనసేన పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇంచార్జ్ వెల్తూరి నాగేష్‌కి మార్గదర్శకంగా ఉండుతూ, పార్టీ అభివృద్ధికి పాటుపడుతున్న ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఆమె విరాళాన్ని ఆలయ పాలక మండలి సభ్యులు అభినందించగా, ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయి. స్థానికులు స్వాతి రెడ్డి గారి సేవా దృక్పథాన్ని ప్రశంసించారు. ఈ గొప్ప మనసున్న నాయకురాలికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, జనసేన తరఫున హార్దిక అభినందనలు.

Share this content:

Post Comment