*ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన జోనల్ చైర్మన్..
ఏలూరు: ఇటీవల ఏలూరు జిల్లాలోని చొదిమెళ్ల వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం మరువకముందే మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం తెల్లవారుజామున 4:00 గంటల సమయంలో కలపర్రు టోల్‌గేట్ సమీపంలో రామచంద్ర ఇంజినీరింగ్ కాలేజీ వద్ద ఈ ఘటన జరిగింది. లారీని తప్పించబోయే క్రమంలో ఆర్టీసీ బస్సు వెనుక నుండి ఢీ కొట్టడంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 12 మంది ప్రయాణికులు గాయపడారు. బస్సు కాకినాడ నుండి గుంటూరు వెళ్లుతుండగా ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిని వెంటనే ఏలూరు సర్వజన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద బాధితులను ఏపీఎస్ ఆర్టీసీ జోనల్ చైర్మన్ & బోర్డు డైరెక్టర్ రెడ్డి అప్పలనాయుడు ఆసుపత్రిలో పరామర్శించారు. ఇంజినీరింగ్ కాలేజీ వద్ద జరిగిన ఈ ప్రమాదం చాలా బాధాకరమని, ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం బాధిత కుటుంబాలకు పూర్తి సహాయం అందజేస్తుందని హామీ ఇచ్చారు. అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఏలూరు డిపో అసిస్టెంట్ మేనేజర్ మురళి, స్టేషన్ మేనేజర్ కుమారి, ఏలూరు ఆర్టీసీ అధికారులు, మరియు జనసేన నాయకులు జోనల్ చైర్మన్ వెంట ఉన్నారు.

Share this content:
Post Comment