రేపటి నుంచి ఏపీకి ఆర్టీసీ బస్సులు

అంతర్‌ రాష్ట్ర బస్సు సర్వీసులకు తెలంగాణ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. తెలంగాణలో లాక్‌డౌన్‌ ఎత్తివేతతో అంతర్‌ రాష్ట్ర సర్వీసులు యథావిధిగా నడవనున్నాయి. రేపట్నుంచి ఏపీకి బస్సులు నడపనున్నట్టు తెలంగాణ ఆర్టీసీ ప్రకటించింది. ఏపీలో లాక్‌డౌన్‌ నిబంధనలకు అనుగుణంగా బస్సు సర్వీసులు నడపాలని టీఎస్‌ ఆర్టీసీ నిర్ణయించింది.