రాష్ట్ర రవాణా శాఖ మంత్రిని కలిసిన ఆర్టీసీ జోనల్ చైర్మన్లు

అమరావతిలోని సచివాలయంలో మంగళవారం రాష్ట్ర రవాణా, యువజన మరియు క్రీడా శాఖల మంత్రి, గౌరవనీయులు మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డిని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్లు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు, ఆర్టీసీ నెల్లూరు జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి, ఆర్టీసీ కడప జోనల్ చైర్మన్ పోలా నాగరాజు మంత్రిని కలుసుకుని వివిధ అంశాలపై చర్చించారు. ఆర్టీసీ సేవల విస్తరణ, ఉద్యోగుల సమస్యలు, ప్రయాణికులకు మెరుగైన సదుపాయాల కల్పనపై అభిప్రాయాలు తెలియజేశారు. రవాణా శాఖ అభివృద్ధికి కృషి చేయాలని మంత్రివర్యులను కోరారు. ఈ సమావేశంలో శాఖా అధికారులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment