ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న అటవీ శాఖ భూములపై అన్యాక్రాంతాన్ని నిరోధించేందుకు జనసేన పార్టీ చురుకుగా వ్యవహరిస్తోంది. పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు పిలుపు మేరకు జిల్లాలోని ప్రతి మండలంలో జనసేన మండల అధ్యక్షులు ఆర్టీఐ యాక్ట్ ద్వారా సంబంధిత ఎమ్మార్వో కార్యాలయాల్లో సమాచారం కోరారు. ఈ చర్య పవన్ కళ్యాణ్ దూరదృష్టిని ప్రతిబింబిస్తోందని, అటవీ భూములను దుర్వినియోగం నుంచి రక్షించేందుకు పార్టీ కట్టుబడి ఉందని నేతలు స్పష్టం చేశారు. భూముల వివరాలు అందిన అనంతరం తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు.
Share this content:
Post Comment