అధికార పార్టీ నాయకులు కోట్లు దోచుకున్నారు, రాష్ట్రంలోనే అతిపెద్ద స్కాం జగనన్న కాలనీలు

♦️ ఇంటి నిర్మాణంలో పేదలను వైసిపి ప్రభుత్వం మోసం చేసింది
♦️ ఇసుకను వైసీపీ నాయకులు బ్లాక్ లో అమ్ముకుంటున్నారు
♦️ టిడ్కో ఇల్లు రిజిస్ట్రేషన్ జరగలేదు
♦️ ప్రభుత్వ అవినీతిని బట్టబయలు చేయడానికి ఈనెల 12,13,14 తేదీల్లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో “జగనన్న ఇల్లు- పేదలందరికీ కన్నీళ్లు” పేరుతో గుంతకల్ నియోజకవర్గంలోని మూడు మండలాల్లో (పామిడి, గుత్తి, గుంతకల్) కార్యక్రమం.
♦️ ప్రభుత్వ అవినీతిని, నిర్లక్ష్యాన్ని ప్రపంచానికి చూపే విధంగా జగనన్న కాలనీలో జనసేన సోషల్ ఆడిట్ చేస్తూ #JaganannaMosam హ్యాష్ ట్యాగ్ తో ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాం.
♦️ ఉమ్మడి అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ

గుంతకల్, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న కాలనీల పేరిట పేదవాడికి జరిగిన అన్యాయాన్ని ప్రపంచానికి తెలియజేసే ఉద్దేశ్యంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మరియు పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ సూచనలతో నెల 12, 13, 14 తేదీల్లో గుంతకల్ నియోజకవర్గంలోని మూడు మండలాల్లో “జగనన్న ఇల్లు – పేదలందరికీ” కన్నీళ్లు అనే కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా నియోజవర్గంలోని జగనన్న కాలనీలని పరిశీలించి ప్రస్తుత పరిస్థితి గురించి తీసిన ఫోటోలు, వీడియోలను #JaganannaMosam హ్యాష్ టాగ్ ద్వారా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ప్రభుత్వ తీరును ఎండగట్టాలని నియోజకవర్గంలోని జిల్లా, మండల నాయకులను మరియు జనసైనికులను వాసగిరి మణికంఠ కోరారు. పేదలందరి ఇళ్ల పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 28 లక్షల 30 వేల మందికి ఇల్లు నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. అందులో భాగంగా తొలి విడతలో 18,63,552 గృహాలు 2022 జూన్ నాటికి నిర్మించి పేదలకు అందిస్తామని చెప్పారు. ఆయన చెప్పిన గడువు ముగిసి 5 నెలలు కావస్తుంది రాష్ట్రంలో ఎక్కడా కూడా ఒక ఇల్లు కూడా పేదలకు ఇచ్చిన దాఖలాలు లేవు. జగనన్న కాలనీలో భూసేకరణ పేరుతో దోపిడీ రాష్ట్రవ్యాప్తంగా 68,677 ఎకరాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది. రూ 10 నుంచి రూ 20 లక్షలు విలువ చేసే ఎకరా భూమిని 70 లక్షల నుంచి కోటి రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు. సుమారు రూపాయలు 23,500 వందల కోట్లు వెచ్చించి ఈ భూములు కొన్నారు. ఇందులో వందల కోట్లు చేతులు మారాయి. అలాగే మౌలిక సదుపాయాల కోసం మరో 34 వేల కోట్లు ప్రభుత్వం కేటాయించింది. ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసిన జగనన్న కాలనీలో తాగునీరు, రోడ్లు వంటి కనీసం మౌలిక సదుపాయాలు లేవు గృహ నిర్మాణ పథకానికి నిధులన్నీ కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నవే. ఈ ఇల్లు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఇసుక మాత్రమే ఉచితంగా అందిస్తుంది అది కూడా ఇసుక రవాణాకు అయ్యే ఖర్చు లబ్ధిదారుడే భరించాలని కండిషన్ పెట్టింది. ఇస్తున్న ఇసుక కూడా ఎక్కడా నుంచి తెచ్చుకోవాలో స్పష్టత ఇవ్వడం లేదు.2022 జూన్ నాటికి 18 లక్షల 63,552 గృహాలు నిర్మిస్తామని చెప్పిన నాయకులు.. ఇప్పటివరకు కేవలం 1,52,000 ఇళ్లను మాత్రమే నిర్మించారు ఇంత దయనీయ పరిస్థితి ఎందుకు వచ్చింది? పేదలను ఎందుకింత దగా చేశారు? ప్రజలకు సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు.